Mukesh Ambani: ధీరూబాయ్ ఇచ్చిన ఆ ఆఫర్ గురించి చెప్పిన ముఖేష్ అంబానీ..!!
Dhirubhai Ambani: దశాబ్దాల కిందట ఒక చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించారు ధీరూబాయ్ అంబానీ. అనేక వ్యాపారాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారాన్ని దశదిశలా విస్తరించారు.
ఈ క్రమంలో తన వారుసులైన ముఖేష్, అనిల్ అంబానీలకు తర్వాత విస్తరణలో భాగంగా వాటిని అప్పగించాలని అనుకున్నారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన వారసులకు వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ వ్యాపారాల్లోకి తీసుకొచ్చే క్రమంలో వారికి బాధ్యతలు అప్పగించటమే అసలైన సవాలు.

అసలు అప్పుడు జరిగిన విషయం గురించి ముఖేష్ అంబానీ ఇలా వెల్లడించారు. తాను స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి విద్యను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన సమయంలో తాను కంపెనీలో చేయాల్సిన జాబ్ ఏమిటని తండ్రిని అడిగినట్లు ముఖేష్ చెప్పారు. చదువు పూర్తి కావటంతో అసలు ఇప్పుడు ఏం చేయమంటారని ధీరూబాయ్ ని అడిగినట్లు వెల్లడించారు.
కుమారుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ధీరూబాయ్ బదులిస్తూ.. ఉద్యోగం అంటే నువ్వు మేనేజర్ లాగా ఉంటావు.. ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టమని సూచించారని ముఖేష్ గుర్తు చేసుకున్నారు. అసలు నువ్వు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో.. నువ్వే అన్వేషించుకోవాలంటూ తండ్రి సూచించినట్లు చెప్పారు.
అందుకే ముఖేష్ ఏం చేయాలి అనే విషయాన్ని ధీరూబాయ్ డిసైడ్ చేయకుండా కుమారుడికే ఆ నిర్ణయాన్ని పూర్తిగా వదిలేసి కెరీర్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. అలా ముఖేష్ తన వ్యాపార ప్రయాణాన్ని తండ్రి అందించిన స్వేచ్ఛతో ప్రారంభించినట్లు ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications