Mukesh Ambani Loss: దేశంలోనే అంత్యంత సంపన్న వ్యాపారవేత్త, ఆసియాలో నెం1 స్థానంలో ధనవంతుడైన ముకేష్ అంబానీ సంపద మంచులా కరిగిపోయింది. వాస్తవానికి నాలుగు రోజుల్లో అంబానీ ఆస్థి లక్ష కోట్లకు పైగా ఆవిరైంది. రిలయన్స్ గ్రూప్ అధినేతను బేజార్చిన పరిస్థితుల గురించి పరిశీలిస్తే..
గడచిన రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొకులను చూశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు కరెక్షన్ అయ్యాయి. వాస్తవానికి మిడిల్ ఈస్ట్ యుద్ధ భయాలు మార్కెట్లను దిగజార్చాయి. ఈ క్రమంలో లక్షల మంది ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అయితే ఇదే పరిస్థితి ప్రముఖ వ్యాపావేత్త ముఖేష్ అంబానీకి సైతం ఎదురైంది. గడచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో అంబానీ సంపద రూ.1.32 లక్షల కోట్లు ఆవిరైపోయి పెద్ద ఆర్థిక దెబ్బ తగిలింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ ధరలో కంపెనీ భారీ పతనాన్ని నమోదు చేసింది.

శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో స్థిరపడింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రధాన ట్రిగర్ గా నిలిచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా చమురు ధరల పెరుగుదల నమోదైంది. చైనా ఆర్థిక వ్యవస్థ తెరచుకోవటంతో.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు చైనా మార్కెట్ల వైపు మళ్లినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చాలా కాలంగా బుల్ జోరును కొనసాగించిన భారతీయ స్టాక్ మార్కెట్లు ఈవారం పెద్ద కరెక్షన్ చూశాయి. దీంతో గడ ఐదు ట్రేడింగ్ సెషన్లలో భారతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.13 లక్షల కోట్లు హరించుకుపోయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో నష్టాన్ని కలిగించాయి. ఈ క్రమంలో గురువారం ఇంట్రాడేలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కరోజే అత్యధికంగా నష్టాన్ని చూసింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గురువారం రూ.77,607 కోట్లకు పైగా తగ్గుదలను చూసింది. ఇదే క్రమంలో మరో సోదరుడు అనిల్ అంబానీకి సైతం షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. రిలయన్స్ పవర్ షేర్లు గత 11 రోజులుగా కొనసాగుతున్న బుల్ ర్యాలీకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో శుక్రవారం స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకింది. దీంతో రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాప్ రూ.20,474 కోట్లకు తగ్గింది.
దీనికి ముందు రిలయన్స్ పవర్స్ బోర్డు అసురక్షిత విదేశీ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్లను జారీ ద్వారా రూ.4,198 కోట్లు సమీకరించే ప్రణాళికను ఆమోదించింది. ఈ బాండ్లను 5 శాతం వార్షిక వడ్డీ రేటుతో అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications