భారత్‌కు ఎమర్జింగ్ మార్కెట్ హోదాను(EM) తగ్గిస్తామని గోల్డెన్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI హెచ్చరించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులకు ప్రామాణికంగా పరిగణించే పలు సూచీలను రూపొందిస్తుంది MSCI. భారత్ సహా పలు ఎమర్జింగ్ మార్కెట్లకు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ పెట్టుబడి మార్గాలను నియంత్రించే కార్యకలాపాలకు పాల్పడితే సూచీలో రేటింగ్ తగ్గిస్తామని పేర్కొంది.
బ్రెజిల్, చైనా, భారత్, కొరియా, టర్కీలో పలు పెట్టుబడి సాధనాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అందుబాటులో లేకుండా నియంత్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా లేదా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పెట్టుబడి సాధనాలను అందుబాటులో ఉంచడాన్ని స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రించవద్దని సూచించింది.

MSCI విడుదల చేసే ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీ, ఆసియా పసిఫిక్ ఎక్స్ జపాన్ సూచీలను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు ప్రామాణికంగా భావిస్తాయి. ఒకవేళ MSCI ఆయా దేశాల రేటింగ్‌ను తగ్గిస్తే అది విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎమర్జింగ్ మార్కెట్ల జాబితాలో ఉన్న దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, భారత్ ముందు వరుసలో ఉంటాయి.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications