బడ్జెట్ సమావేశాల తర్వాత పుంజుకున్న స్టాక్ మార్కెట్లకు మళ్లీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనావైరస్ కేసులు మొదటిసారిగా 1 లక్షల మార్కును దాటిన తరువాత ఒక్కసారిగా మార్కెట్లో భయాలు మొదలయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తాజా లాక్డౌన్లను ప్రారంభించిన తరువాత, మూవీ ఎగ్జిబిటర్స్ షేర్లు - పివిఆర్ మరియు ఐనాక్స్ లీజర్ బిఎస్ఇలో ఒక్కొక్కటి 8 శాతానికి పైగా పడిపోయాయి.

కరోనా ఎఫెక్ట్ .. సినిమా హాళ్ళ మూసివేతతో నష్టాల్లో ఎగ్జిబిటర్లు
కరోనావైరస్ కేసులలో భయంకరమైన పెరుగుదల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి 8 నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ మరియు వారాంతాల్లో "కఠినమైన లాక్డౌన్" సహా కొత్త ఆంక్షలను ప్రకటించింది. లాక్డౌన్లో భాగంగా, కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి సినిమా హాళ్ళు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.
మహారాష్ట్రలో శనివారం దాదాపు 50,000 కొత్త కేసులు నమోదయ్యాయి . ఈ కేసులు ఒక్కరోజు రోజు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో 60 శాతం.

భారతదేశంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో మార్కెట్ లో ఆందోళన
రాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం 11,000 కేసులు నమోదయ్యాయి - 2019 డిసెంబరులో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఒక రోజులో అత్యధికం. శనివారం, నగరంలో 9,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,03,558 తాజా కోవిడ్ కేసులతో, భారతదేశం రోజువారీ అతిపెద్ద కరోనా కేసులు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య 1,25,89,067 కు చేరుకుంది. పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక స్టాక్ మార్కెట్ లోనూ కోవిడ్ భయంతో నేడు నష్టాల బాటలో సాగింది .

నష్టాలను చవి చూసిన పివిఆర్ , ఐనాక్స్ లీజర్ షేర్లు,
కేంద్రబృందాలను తీవ్రంగా కరోనా ప్రభావమున్న మూడు రాష్ట్రాలకు తరలించారు. కరోనా కేసుల పెరుగుదల భయాల మధ్య మూవీ ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పలు మల్టీప్లెక్స్ ల నిర్వాహకులు సైతం కరోనా కారణంగా నష్టాలను చవి చూస్తున్నారు . థియేటర్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో కుదేలు అవుతున్నాయి. ఈరోజు పివిఆర్ షేర్లు భారీగా నష్టాలను చవి చూసి 1,173 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యాయి ఒక దశలో1,134 రూపాయలకు చేరుకొని నష్టాలను చవిచూశాయి. ఐనాక్స్ లీజర్ 265రూపాయల వద్ద ట్రేడయ్యాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications