మా ఉద్యోగుల్ని కాపాడుకుంటాం, కోలుకోవడానికి 7 నెలలు పట్టొచ్చు: సర్వేలో ఇంట్రెస్టింగ్

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి, డిమాండ్ లేక ఉద్యోగాల తొలగింత, వేతన కోత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులను కాపాడుకుంటామని, క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలుస్తామని చెబుతున్నాయి. ఈ మేరకు జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిబ్బందిని నిలబెట్టుకుంటామని 81 శాతం కంపెనీల యాజమాన్యాలు తెలిపాయి.

ఉద్యోగాలపై ఎంతమంది ఎమన్నారంటే

ఉద్యోగాలపై ఎంతమంది ఎమన్నారంటే

ఈ సర్వే ప్రకారం తమ ఉద్యోగులను నిలుపుకుంటామని 81 శాతం మంది కంపెనీలు చెప్పాయి. అదే సమయంలో కొత్త నియామకాలు మాత్రం చేపట్టలేమని 53 శాతం కంపెనీలు వెల్లడించాయి. 15 శాతం యజమానులు కొత్త ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపాయి. సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు 21 శాతం కంపెనీలు తెలిపాయి. సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగాలతో పోలిస్తే జూనియర్ స్థాయి ఉద్యోగాలలోనే ఎక్కువగా తొలగింపులు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక సిబ్బంది నియామకాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎక్కువ మంది తెలిపారు.

కొత్త ఉద్యోగాలు వస్తాయి.. ఇంక్రిమెంట్స్ కష్టమే

కొత్త ఉద్యోగాలు వస్తాయి.. ఇంక్రిమెంట్స్ కష్టమే

ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని 10 శాతం మంది చెప్పడం గమనార్హం. ఉద్యోగార్థులకు ఉత్తరాది ప్రాంతంలో మరిన్ని అవకాశాలు లభించవచ్చునని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంక్రిమెంట్ ఇచ్చే పరిస్థితులు లేవని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంక్రిమెంట్ 5 శాతం కంటే తక్కువగా ఉండవచ్చునని 27 శాతం మంది చెప్పారు. 5 శాతం నుండి 10 శాతం ఇంక్రిమెంట్ ఉంటుందని 11 శాతం మంది చెప్పారు.

నైపుణ్యాలు అలవర్చుకోవాలి

నైపుణ్యాలు అలవర్చుకోవాలి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలను ఎప్పటికి అప్పుడు పెంచుకోవాలని, పరిశ్రమల పోకడ ప్రకారం ముందుకు సాగాలని జీనియస్ కన్సల్టెంట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ యాదవ్ అన్నారు. హెల్త్ ఇండస్ట్రీ, ఎసెన్షియల్ రిటైల్, ఐటీ లేదా వెబ్ సంబంధిత సేవలు, ఈ కామర్స్ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఆర్థిక పరిస్థితి కోలుకోవడానికి ఆరేడు నెలలు

ఆర్థిక పరిస్థితి కోలుకోవడానికి ఆరేడు నెలలు

కరోనా - లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి కోలుకోవడానికి ఆరేడు నెలల సమయం అయినా పడుతుందని, ఈ మేరకు డాబ్ మార్కెట్ పైన ప్రభావం ఉంటుందని ఆర్బీ యాదవ్ అన్నారు. కాగా, ఆటో, ఆటో సహాయక రంగాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ తదితర రంగాలకు చెందిన 1200 మందితో ఆన్ లైన్ సర్వే నిర్వహించారు.

ఉద్యోగానికి వెళ్లాలంటే..

ఉద్యోగానికి వెళ్లాలంటే..

కంపెనీలు ఉత్పత్తులు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసినా తాము ఉద్యోగాల్లో చేరడం ఆరోగ్యంతో రాజీపడటమేనని కొంతమంది భావిస్తున్నట్లుగా ఓ సర్వేలో వెల్లడైంది. హెల్త్ టెక్నాలజీ రంగంలోని FYI వివిధ నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం 93% ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు కార్పొరేట్ ఆరోగ్య బాధ్యత చేపట్టాలని 99% మంది కోరగా 85% మంది నిత్యం తమ ఆఫీసులను శానిటైజ్ చేయాలన్నారు. 73% మంది యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహించాలని కోరారు. వినూత్నమైన భద్రతా మార్గదర్శకాలు, ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+