క్రిప్టోలు ఉండకపోవచ్చు, అమెరికాకు 2.5 ట్రిలియన్ డాలర్ల సమస్య: రఘరాం రాజన్ హెచ్చరిక
6000కు పైగా క్రిప్టో కరెన్సీ చలామణిలో ఉందని, మున్ముందు ఇందులో మహా అయితే ఒకటి లేదా రెండు లేదా కొన్ని మాత్రమే మనుగడలో ఉండవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రస్తుత క్రిప్టో ధరలు అన్నీ బబుల్ వంటివి అని అభిప్రాయపడ్డారు. చాలా క్రిప్టోలకు ప్రస్తుతం వ్యాల్యూ ఉందని, ఎందుకంటే అక్కడ కొనుగోలు చేయడానికి ఇష్టపడే పెద్ద మూర్ఖుడు ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మానియాను 17వ సెంచరీ నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో పోల్చారు.
క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో పోల్చారు. ప్రజల నుండి డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురయ్యే అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్ వలె క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా మున్ముందు బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదని, వాటిలో చాలా వరకు శాశ్వత వ్యాల్యూ లేనివే అన్నారు. ఇందులో కొన్ని చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని, అందులోను క్రాస్ బార్డర్ పేమెంట్స్ అన్నారు.

అమెరికాకు 2.5 ట్రిలియన్ డాలర్ల సమస్య
అమెరికాలో క్రిప్టో అనేది 2.5 ట్రిలియన్ డాలర్ల సమస్య అన్నారు రఘురాం రాజన్. భారీ సమస్య కారణంగా దీనిని రెగ్యులేట్ చేయాలని కోరుకోవడం లేదన్నారు. రెగ్యులేటర్లు ఎలా నియంత్రించాలో పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కొంతవరకు సమస్య క్లిష్టమైందన్నారు. క్రిప్టో ఎంటిటీల నుండి సమాచారం పొందాలని ప్రభుత్వం పట్టుబట్టవచ్చునని, క్రిప్టో ఎంటిటీలు చాలా పెద్దవి అని, మోసం చేయలేదని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం వాటిని మరింత నిశితంగా పరిశీలించవచ్చునని చెప్పారు.
అంతర్లీనంగా ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ వృద్ధికి భారత ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతించాలన్నారు రాజన్. ముఖ్యంగా సరిహద్దుల్లో బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ చాలా చౌకగా ఉంటాయన్నారు.

విదేశీ మారక ద్రవ్య సమస్యపై...
బిట్ కాయిన్ విదేశీ మారక ద్రవ్య సమస్య సృష్టిస్తుందో లేదో చెప్పలేమన్నారు. మైనింగ్ కంటే భారత్‌లో బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి ఎఫ్ఎక్స్ సమస్య ఉండవచ్చునన్నారు. దీర్ఘకాలంలో వీటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి ఉంటే, ఓవర్ టైమ్ వ్యాల్యూను కోల్పోతే మనం ఇందులోకి ఎందుకు అడుగు పెట్టామా అని ప్రజలు బాధపడతారన్నారు. నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారోనని ఆందోళన చెందుతారన్నారు.

అక్కడ మాత్రమే చట్టబద్దత
శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతిస్తుంది.
దేశంలో రూ.40,000 విలువైన లేదా 5.39 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోను కలిగి ఉంది. 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకు క్రిప్టోకు చట్టబద్దత కల్పించిన దేశాల్లో ఎల్ సాల్వేడార్ మాత్రమే ఉంది.


Click it and Unblock the Notifications