For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'అమెరికా-చైనా ట్రేడ్ వార్‌తో లాభం, ఆంధ్రప్రదేశ్ అపాచీలో 2021 నాటికి 3,000 ఉద్యోగాలు'

|

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడలోని అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌లో మూడేళ్లు పూర్తి చేసుకున్న కార్మికులతో 15వ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ జీఎం గెవిన్ ఛాంగ్ మాట్లాడారు. అపాచీ ఫుట్‌వేర్ కంపెనీ విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

2021 సంవత్సరం నాటికి 2 మిలియిన్ల బూట్ల తయారీ లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు 12 నుంచి 14 లక్షల మధ్య ఉన్న నెలవారీ బూట్ల తయారీ సామర్థ్యాన్ని 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ విస్తరణ పూర్తయితే ప్రస్తుతం 11,900 ఉన్న కార్మికుల సంఖ్యకు మరో 3వేలు పెరుగుతుంది.

ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే?ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే?

More than 3,000 new jobs in apache footwear by 2021

అమెరికా - చైనా మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ తమ కంపెనీకి అనుకూలంగా మారినట్లు గెవిన్ ఛాంగ్ తెలిపారు. ప్రధాన కస్టమర్ ఆడిదాస్ నుంచి మరిన్ని ఆర్డర్లు వస్తాయన్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌కు మాత్రమే తమ ఉత్పత్తులు పరిమితమయ్యాయని, ఇక నుంచి దేశీయ మార్కెట్లో కూడా విక్రయిస్తామని చెప్పారు.

English summary

'అమెరికా-చైనా ట్రేడ్ వార్‌తో లాభం, ఆంధ్రప్రదేశ్ అపాచీలో 2021 నాటికి 3,000 ఉద్యోగాలు' | More than 3,000 new jobs in apache footwear by 2021

More than 3,000 new jobs in apache footwear by 2021
Story first published: Monday, December 30, 2019, 9:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X