భారత వృద్ధి రేటు అంచనాలను మూడీస్ రేటింగ్ సంస్థ 5.4 శాతానికి తగ్గించింది. ఆర్థిక మందగమనం వంటి వివిధ కారణాలతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ నెమ్మదించిన నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.6 శాతం వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించి 5.4 శాతానికి తగ్గించింది.
ప్రస్తుత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులు వేసిందని, అయితే తాము గతంలో అంచనా వేసిన దాని కంటే నెమ్మదించిందని మూడీస్ తెలిపింది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం, 2020-21లో 5.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చునని తెలిపింది.

గత ఏడాది నవంబర్ నెలలో వృద్ధి రేటును వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా అంచనా వేసింది. ఆర్థిక ప్యాకేజీలకు 2020 బడ్జెట్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపింది. ఆరేళ్ళ కనిష్టానికి వృద్ది రేటు పడిపోయినా కేంద్రం ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించలేదని, పన్ను తగ్గించకపోవడం కూడా వృద్ధి రేటు తగ్గిందన్నారు. ఆహార ద్రవ్యోల్భణంతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లునట్లు తెలిపింది.
అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయ అంశాలు భారత్ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, దేశీయ అంశాలు కాస్త ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. దేశీయ డిమాండ్ పెంపు, బ్యాంకింగ్ మందగమనం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడ్డానికి ఈ అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది.


Click it and Unblock the Notifications