మొబైల్ ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. సిమ్ కార్డు వినియోగదారులు మరికొద్ది రోజుల్లో కార్డును మార్చుకోకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్‌కు, ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్‌కు మారవచ్చు. ఈ మేరకు టెలికం శాఖ ఏడీజీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను టెలికం శాఖకు భారతీయ సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తిరిగి టెలికం ఆపరేటర్లకే సూచించింది. అయితే తదనంతర ఫలితాంపై నిర్ణయం ఉంటుందన్నారు.
మొత్తానికి మొబైల్ ఫోన్ యూజర్లు పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్‌కు, ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్‌కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేయడం గమనార్హం. ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు(POC) ఇవ్వాలని టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు.

టెల్కో ప్రతిపాదన ప్రకారం కనెక్షన్‌ను మార్చుకోవాలనుకునే వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్, వెబ్‌సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపించాలి. దీనిని ఆమోదిస్తూ టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపుతుంది. ఈ ఓటీపీ పది నిమిషాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే కనెక్షన్ మార్పుకు వినియోగదారు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుండి మార్పు అమలులోకి వస్తుందనే సమాచారాన్ని అందిస్తుంది. ఇలా కనెక్షన్ మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు వరకు సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
దేశంలో 5G హైస్పీడ్ డేటా సేవల ప్రారంభానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎయిర్‌టెల్ సోమవారం తెలిపింది. నెట్ వర్క్ క్వాలిటీ పెంచేందుకు కర్నాటక, తమిళనాడుల్లో అదనపు స్పెక్ట్రంను సమకూర్చనున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications