అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో దేశీయ కార్పోరేట్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. మినీ ట్రేడ్ డీల్ ఉంటుందని, అమెరికన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అమెరికా నుండి పెట్టుబడులు వచ్చేలా ఈ పర్యటన ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి, వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

వీటిపై భారత్ డిమాండ్
ఇప్పటికే స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అధిక టారిఫ్ నుండి మినహాయింపు కావాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) కింద కొన్ని దేశీయ ఉత్పత్తులకు ఎగుమతి ప్రయోజనాలు తిరిగి ప్రారంభించాలని కోరుతోంది. వ్యవసాయ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులపై ఈ ప్రయోజనాలు కల్పించాలని కోరుతోంది.

అమెరికా ఏం కోరుకుంటోందంటే..
అమెరికా కూడా పలు డిమాండ్లు భారత్ ముందు ఉంచింది. వ్యవసాయ, ఉత్పాదక ఉత్పత్తులు, పాల వస్తువులు, వైద్య పరికరాలు, డేటా స్థానికీకరణ, సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు తగ్గించాలని భారత్‌ను కోరుతోంది. భారత్‌తో అధిక వాణిజ్య లోటుపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పటిష్టం చేసేందుకు పునాది..
ద్వైపాక్షిక మినీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ట్రంప్ పర్యటనలో ఒక చిన్నపాటి వాణిజ్య ఒప్పందం కుదిరినా సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు పునాది అవుతుందని చెబుతున్నారు. భారత్‌కు చెందిన కొన్ని ఇండస్ట్రీలు అమెరికాలు పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇరువురు దేశాధినేతలు వాణిజ్య ఒప్పందానికి ప్రధాన్యత ఇస్తారని చెబుతున్నారు.

1.13 లక్షల ఉద్యోగాలు..
CII అంచనాల ప్రకారం.. దాదాపు 100కు పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 2018-19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017-18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది.

ట్రంప్ పర్యటనకు సిద్ధం..
ఇరుదేశాల వాణిజ్య వర్గాలు ట్రంప్ పర్యటనపై కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అవుతారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొంటారు.
More From GoodReturns

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications