IT News: కష్టాల్లో మధ్య స్థాయి ఐటీ కంపెనీలు.. టెక్కీల గుండెల్లో మెుదలైన భయాలు..

Tech News: ఐటీ రంగంలోని కంపెనీల భవితవ్యం పూర్తిగా మారిపోయింది. వ్యాపార మందగమనంతో పాటు మారిన క్లైంట్ల ధోరణితో మధ్యస్థాయి టెక్ సేవల కంపెనీలకు కష్టాలు మెుదలయ్యాయి. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న టెక్కీలు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో మిడ్-టైర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు తమ రంగంలోని పెద్ద సంస్థల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. వాస్తవానికి క్లయింట్లు వెండర్ కన్సాలిడేషన్ డీల్‌లు ఈ కంపెనీల రాబడి వృద్ధిలో క్షీణతకు దారితీశాయి. దీనికి తోడు కీలక మార్కెట్లలో అనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా క్లయింట్లు తక్కువ టెక్ ఖర్చు చేయడం గత కొన్ని త్రైమాసికాలుగా ఐటీ కంపెనీలకు ఇబ్బందులను పెడుతోంది. పెద్ద కంపెనీలు తమ వెండర్లను తగ్గించిన సమయంలో మిడ్-టైర్ కంపెనీలపై భారం పడింది. ఇది పరోక్షంగా మార్జిన్‌లపై ఒత్తిడి తెచ్చింది.

Mid range Indian IT companies in pressure amid clients vendor consolidation going

వాస్తవానికి ఐటీ పరిశ్రమలో విక్రేత కన్సాలిడేషన్ ఒప్పందాల్లో క్లయింట్‌లు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సరఫరాదారుల సంఖ్యను తగ్గించుకుంటారు. ఇది తరచుగా పెద్ద ఐటీ కంపెనీలకు సానుకూలంగా మారుతుంటుంది. ఇక్కడ కంపెనీలకు-క్లయింట్లకు మెరుగైన ధరలకు డీల్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇదే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ వంటి సాంకేతికతలపై ఖర్చు చేయడం వల్ల తక్కువ నిధులు కలిగి ఉంటే చిన్న కంపెనీలకు అదనపు ఖర్చులకు దారితీశాయని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం మిడ్ టైర్ కేటగిరీ కిందకు వచ్చే ఐటీ సేవల కంపెనీలను పరిశీలిస్తే.. LTIMindtree, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, L&T టెక్నాలజీ సర్వీసెస్, కోఫోర్జ్, KPIT టెక్నాలజీస్‌ ఉన్నాయి. ఈ కేటగిరీలోని కంపెనీలు ప్రధానంగా తమ వ్యాపారంలో కీలకమైన క్లయింట్లపైనే ఆధారపడతాయని అన్నారు. అందువల్ల తమ ఖాతాదారులకు ఏదైనా జరిగితే వాటి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది.

పెద్ద కంపెనీలు తమ వెండార్లను తగ్గించినప్పుడల్లా మధ్య స్థాయి కంపెనీలు ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీలు పునరుద్ధరణ చర్యలు చేపట్టి ఉద్యోగుల సంఖ్యలను, ఖర్చులను మదింపు చేసుకుంటుంటాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో చాలా మధ్యస్థాయి కంపెనీల ఆదాయ వృద్ధి భారీగా తగ్గినట్లు ఇటీవల కంపెనీల ఫలితాలు వెల్లడించాయి.

ఇదే క్రమంలో LTIMindtree, Persistent Systems, Coforge మొదలైన మిడ్-టైర్ కంపెనీల మార్జిన్లు తగ్గాయి. అయితే ఇదే సమయంలో పెద్ద టెక్ కంపెనీలైన TCS, HCLTech, కష్టాల్లో ఉన్న విప్రో కూడా FY24లో తమ మార్జిన్‌లను మెరుగుపర్చుకున్నాయి. ఇదే క్రమంలో మందగిస్తున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రాతిపదికన హెడ్ కౌంట్ పెరుగుదల తక్కువగా కనిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్, L&T టెక్నాలజీ సర్వీసెస్, Coforge, KPIT, Birlasoft, Tata Elxsiతో కూడిన మిడ్-టైర్ IT కంపెనీలు దాదాపు 11,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితితులతో జాబ్ గ్యారెంటీ లేదంటూ చాలా మంది టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+