LinkedIn laysoffs: ఉద్యోగులను తొలగించిన లింక్డ్ఇన్.. మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ నిర్ణయం..
LinkedIn laysoffs: అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన కంపెనీ లింక్డ్ఇన్. ఇంతకు ముందు టెక్ ఉద్యోగులను ఇళ్లకు పంపిన మైక్రోసాఫ్ట్ తాజాగా లింక్డ్ఇన్ ఉద్యోగులనూ తొలగించనున్నట్లు తెలుస్తోంది. రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగించింది.

తాజా నివేదిక..
2023లో లేఆఫ్ ప్రకటించిన కంపెనీల జాబితాలోకి లింక్డ్ఇన్ కూడా చేరిపోయింది. నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను లింక్డ్‌ఇన్‌కు విస్తరించింది. తొలగింపులపై కంపెనీ సోమవారం ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేసినట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి మీడియా వెబ్‌సైట్‌కు తెలియజేశారు. లింక్డ్‌ఇన్ లేఆఫ్‌ల ద్వారా ఎంత మంది ప్రభావితమయ్యారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

కొత్త నియామకాలు..
లింక్డ్‌ఇన్ 2022 నవంబర్ నుంచి కొత్త ఉద్యోగుల నియమాకాలను నిలిపివేసింది. అయితే ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదని అప్పట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, CEO ర్యాన్ రోస్లాన్స్కీ అప్పట్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించటంతో.. ఆ సెగ ఇప్పుడు లింక్డ్ఇన్ ను తాకిందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

లేఆఫ్స్ 2023..
ఆర్థిక అస్తిరతల మధ్య పరివర్తన కారణంగా ప్రభావితమైన ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. అమెరికా చట్టాల ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ, స్టాక్ అవార్డులను కొనసాగిస్తామన్నారు. అలాగే అమెరికా బయట పనిచేస్తున్న ఉద్యోగులకు అక్కడి స్థానిక చట్టాల ప్రకారం ప్రయోజనాలను అందిస్తామని సత్యనాదెళ్ల వెల్లడించారు. దీనికి ముందు గూగుల్ సైతం భారీగానే తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంది.


Click it and Unblock the Notifications