ఇదే 2025లో రెండోసారి మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతల గురించి ప్రకటన ఇచ్చారు, దీనిబట్టి టెక్ రంగంలో మార్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మే నెలలో తొలిసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన సంస్థ, ఇప్పుడు జులైలో మరోసారి అదే దారిలో నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, మానవ వనరులను తగ్గిస్తూ తన నిర్మాణాన్ని నూతనంగా మలుచుకుంటోంది. ఈ నిర్ణయం సంస్థ అభివృద్ధి దిశలో ఒక వ్యూహాత్మక అడుగు కాగా, వేలాది మంది ఉద్యోగులకు ఇది ఊహించని సమస్యగా మారింది. రెండోసారి వచ్చిన ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలు, ప్రభావిత విభాగాలు, ఈ సంస్థ భవిష్యత్ దిశపై అడుగులు గురించి తెలుసుకుందాం.

2025 సంవత్సరం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కష్టకాలం అనే చెప్పవచ్చు. ఏకంగా ఈ ఏడాదిలో ఇది రెండోసారి పెద్ద స్థాయిలో లేఅఫ్‌కి పాల్పడింది కంపెనీ. మే నెలలోనే దాదాపు 6,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ వెంటనే జూన్‌లో మరో 300 మందికిపైగా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు జూలై వచ్చేసరికి మళ్లీ పెద్ద ఎత్తున సుమారు 9,000 మందిని బయటకు పంపునట్లు సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగులలో దాదాపు 4 శాతం మందిని ఈసారి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.
మైక్రోసాఫ్ట్ తాజా 4% ఉద్యోగుల తొలగింపులు ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ (ఎక్స్‌బాక్స్, కింగ్, జెని మ్యాక్స్, టర్న్ 10) విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎక్స్‌బాక్స్ గ్రూపులో ముఖ్యంగా భారీ కోతలు జరిగాయి. ఉదాహరణకు టర్న్ 10 స్టూడియోలో సగానికి పైగా ఉద్యోగులు కోల్పోయారు, అలాగే కింగ్ డివిజన్‌లో 10% ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ప్రముఖ గేమ్ ప్రాజెక్టులు అయిన పెరఫెక్ట్ డార్క్, ఎవర్ విల్డ్ వంటి గేమ్స్ రద్దయ్యాయి, The Initiative వంటి స్టూడియోలు మూసివేయబడ్డాయి. జెని మ్యాక్స్, రావెన్ సాఫ్ట్ వేర్, స్లెడ్జ్‌హ్యామర్ గేమ్స్, రేర్ వంటి అనేక స్టూడియోలు కూడా ఈ లేఅవ్‌ల వల్ల ప్రభావితమయ్యాయి.
ఈ లేఅవ్‌లలో వాషింగ్టన్ రాష్ట్రంలో మాత్రమే 830 ఉద్యోగాలు తొలగించబడ్డాయని అధికారిక సమాచారం ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగాలలో సుమారు 9%కి సమానం. ఈ చర్యలు సంస్థ వ్యయ నియంత్రణ, మేనేజ్మెంట్ సరళీకరణ, మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా మార్పులు చేయడం వంటి వ్యూహాత్మక అవసరాల నేపథ్యంలో తీసుకున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు దాదాపు $80 బిలియన్ పెట్టుబడులు వేస్తున్న మైక్రోసాఫ్ట్, ఈ మారుతున్న పరిస్థితులు అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని మరింత సజావుగా మలచే పనిలో ఉంది. వినియోగదారుల అవసరాలను వేగంగా తీర్చడమే కాక, నిర్వహణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ స్థాయిలను సీరియస్‌గా కుదించుతోంది. ఈ ప్రణాళికలలో భాగంగానే, తాజా ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి.
గత త్రైమాసిక ఆర్థిక నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ $70 బిలియన్ ఆదాయాన్ని మరియు $26 బిలియన్ నికర లాభాన్ని నమోదుచేసింది. జూన్ 26న కంపెనీ షేర్ ధర అత్యధిక స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో కొత్తగా 0.6% శాతం తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఆదాయం మరియు లాభాల్లో స్థిరతను చూపించినా, సంస్థ ముందస్తుగా భవిష్యత్ మౌలిక మార్పుల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో షేర్ ప్రైస్‌లను కొద్దిగా ప్రభావితం చేసింది.
ప్రయాణికులకు బిగ్ షాక్.. రైడ్ ఛార్జీలు 200 శాతం పెంచనున్న ఓలా, ఉబెర్ కంపెనీలు..కారణం ఏంటంటే
"మార్కెట్ పరిస్థితులు మారడంతో ఖర్చులను నియంత్రించాలి అనిపించింది" అనే వాక్యం మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పొచ్చుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో సంస్థలు తమ ఖర్చులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ ఖర్చులు (employee costs) కంపెనీలో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి, ఉద్యోగులను తగ్గించడం ద్వారా ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కంపెనీ లాభదాయకతను నిలబెట్టుకోవడం కోసం ఖర్చులను తగ్గించడం అత్యవసరం అవుతుంది. ఇది షేర్‌హోల్డర్లకు మంచి రాబడి ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. మార్కెట్‌లో వచ్చే అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి, కంపెనీ తన వ్యయ నిర్మాణాన్ని మరింత స్థిరంగా మార్చుకోవాలి. అందుకే ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది.


Click it and Unblock the Notifications