ప్రయాణికులకు బిగ్ షాక్.. రైడ్ ఛార్జీలు 200 శాతం పెంచనున్న ఓలా, ఉబెర్ కంపెనీలు..కారణం ఏంటంటే
ఉద్యోగాలు, అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సినప్పుడు చాలా మంది క్యాబ్‌లు బుక్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుమతించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, పీక్ టైంలో క్యాబ్ ఛార్జీలు 200% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది రోజూ క్యాబ్ ఉపయోగించే ప్రయాణికులకు ఎంతో ముఖ్యమైన మార్పుగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో, క్యాబ్(ఓలా, ఉబెర్, రాపిడో) సంస్థలకు బేస్ ఛార్జ్‌కు రెండింతలు వరకు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు ప్రయాణికులపై, డ్రైవర్లపై ఎలా ప్రభావం పెరుగుతుందో తెలుసుకుందాం.

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా మోటారు వాహన ఎగ్రిగేటర్ మార్గదర్శకాలు (MVAG 2025) విడుదల చేసింది. వీటిలో క్యాబ్ కంపెనీలకు పీక్ అవర్స్‌లో 2 రెట్లు వరకు ఛార్జ్ వసూలు చేసే హక్కు లభించింది. ఇంతకుముందు ఇది 1.5 రెట్లు మాత్రమే అనుమతించబడింది. ఈ మార్పుతో ప్రయాణికులపై ధరల భారం పెరగుతుంది.
కొత్త ఛార్జీలు:
పీక్ అవర్స్‌లో (Peak Hours) క్యాబ్ అగ్రిగేటర్లు (ఓలా, ఉబెర్ లాంటి సంస్థలు) బేస్ ఛార్జ్‌కు రెండు రెట్లు (200%) వరకు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు, ఒక సాధారణ రైడ్‌కి రూ. 100 బేస్ ఛార్జ్ ఉంటే, పీక్ టైంలో అదే రైడ్‌కు రూ. 200 వరకు వసూలు చేయవచ్చు.
నాన్ పీక్ టైం(Non-Peak Hours)లో అయితే ఇదే బేస్ ఛార్జ్‌కి (50%) మాత్రమే వసూలు చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అంటే రూ. 100 బేస్ ఛార్జ్ ఉంటే, నాన్ పీక్ టైంలో కేవలం రూ. 50 మాత్రమే వసూలు చేయాలి.
ఈ కొత్త చార్జీల మార్చడం వల్ల ధరలలో పారదర్శకత అవసరం ఉండడంతో పాటు, కనీస ఛార్జీలపై స్పష్టత ఉండటం ప్రయాణికులకు భద్రతను కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం, క్యాబ్ అగ్రిగేటర్లకు కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను అనుసరించటం తప్పనిసరిగా చేసింది. ప్రతి క్యాబ్‌లో రియల్ టైమ్ ట్రాకింగ్‌కు అనువుగా GPS ఉండాలి. ఇది ప్రయాణికుల భద్రతకు ఎంతో కీలకం.
అన్ని క్యాబ్‌లు రవాణా శాఖలో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లను కూడా అప్డేట్ చేయాలి. డ్రైవర్లు అనుచిత ప్రవర్తన చేయరాదని, ప్రవర్తనపై పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ప్రమాదాల సమయంలో రక్షణ కలిగించే విధంగా బీమా ఉండటం తప్పనిసరి అని చెప్పారు.
అలాగే డ్రైవర్ ట్రిప్‌ను రద్దు చేస్తే, మొత్తం ఫేర్‌పై 10% లేదా గరిష్ఠంగా రూ. 100 వరకు జరిమానా విధించవచ్చు. అదే విధంగా, ప్రయాణికుడు అవసరం లేకుండా క్యాబ్‌ను రద్దు చేస్తే కూడా ఇదే పద్ధతిలో జరిమానా వసూలు చేయనున్నారు.
సురక్షిత ప్రయాణం కోసం కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టారు. అందులో డ్రైవర్ వెరిఫికేషన్, వాహన వయస్సు పరిమితులు (ఉదాహరణకు 8 సంవత్సరాలు లోపు వాహనమే యాక్టివ్‌గా ఉపయోగించాలి), జీవీఎస్ ట్రాకింగ్, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ వంటి అంశాలు తప్పనిసరి చేశారు. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముందడుగులుగా చూడవచ్చు.
ఇటీవల పెద్ధ నగరాలలో కొంత మందికి కార్లు ఉండటం వల్ల ఐటీ ఉద్యోగులు ఎక్కువుగా కార్‌పూలింగ్, షేర్డ్ రైడ్‌లకు ఎక్కువగా ఉపయోగిస్తునారు. ఇప్పుడు ఈ క్యాబ్ ధరలు పెరగడం వల్ల కార్‌పూలింగ్, షేర్డ్ రైడ్‌లు డిమాండ్ పెరిగి ఎక్కువ మంది ఎంచుకునే అవకాశం ఉంది.
సర్జ్ ప్రైసింగ్ వల్ల ప్రజలు మరింతగా బస్సులు, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. కానీ, వాటి అందుబాటు మెరుగుపడకపోతే, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవు.
ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత, ప్రయాణికులకు మరింత భద్రత, పారదర్శకత మరియు న్యాయమైన ఛార్జీలు లభించనున్నాయి. డ్రైవర్లకు కూడా తగిన రక్షణ మరియు స్పష్టమైన నిబంధనలు ఉండటంతో వారి ఆదాయం, పనితీరు మీద ప్రభావం పడనుంది. మొత్తంగా చూస్తే, కొత్త నిబంధనలతో క్యాబ్ సేవలు మరింత నమ్మకమైనవిగా, సమర్థవంతమైనవిగా మారే అవకాశముంది. అయితే, ఇవన్నీ సమర్థంగా అమలవుతాయా లేదా అనేది ఆచరణలో ఎలా అమలవుతాయో దాని మీద ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications