సత్య నాదెళ్ల కొత్త బిజినెస్: బెంగళూరు కంపెనీలో భారీ పెట్టుబడి

బెంగళూరు: సత్య నాదెళ్ల.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టెక్ వరల్డ్‌ను శాసిస్తోన్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మన తెలుగువాడు. ఇప్పుడాయన కొత్త బిజినెస్‌ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతూనే- తన ఆదాయ పరిధిని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు.ఆ కంపెనీకి సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు.

గ్రోవ్‌లో ఇన్వెస్టర్‌గా..

గ్రోవ్‌లో ఇన్వెస్టర్‌గా..

ఆ కంపెనీ- గ్రోవ్ (Groww). బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీ ఇది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఇది. మ్యూచువల్ ఫండ్స్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్, షేర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగపడే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. 2016లో బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఏర్పాటైంది. బిలియన్ డాలర్ల కంపెనీగా ఆవిర్భవించింది. యూనికార్న్ హోదాను పొందింది. ఆన్‌లైన్ డీమ్యాట్, ట్రేడింగ్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది.

అడ్వైజర్‌గా..

అడ్వైజర్‌గా..

ఈ కంపెనీలో సత్య నాదెళ్ల తాజాగా భారీ పెట్టుబడులు పెట్టారు. తమ కంపెనీకి ఇన్వెస్టర్‌గా..అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గ్రోవ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లలిత్ కేష్రే వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. సత్య నాదెళ్ల వంటి టెక్ దిగ్గజంతో కలిసి పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆయనను తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

యూనికార్న్ హోదా..

యూనికార్న్ హోదా..

గ్రోవ్ కంపెనీని టైగర్ గ్లోబల్ ప్రమోట్ చేస్తోంది. సిరీస్ డీ రౌండ్‌లో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో 83 మిలియన్ డాలర్ల మేర అందుకుంది. అనంతరం తన వ్యాల్యుయేషన్‌ను భారీగా పెంచుకోగలిగింది. అదే సంవత్సరం అక్టోబర్‌ నాటికి 251 మిలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలను నమోదు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే యూనికార్న్ హోదాను సాధించిందీ గ్రోవ్ కంపెనీ. ఒక బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్..

ఆన్‌లైన్ డీమ్యాట్, ట్రేడింగ్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి కార్యకలాపాల సెగ్మెంట్‌లో ఉన్న జెరోధా, పేటీఎం మనీ, అప్‌స్టాక్స్ వంటి స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా ఎదిగిందీ గ్రోవ్. ప్రస్తుతం రెండు మిలియన్ల యాక్టివ్ ఇన్వెస్టర్లు తమకు ఉన్నట్లు గ్రోవ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఓవరాల్ యూజర్స్ బేస్ 20 మిలియన్లుగా నమోదైనట్లు స్పష్టం చేసింది. ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టడం, సెకెండరీ షేర్లను కొనుగోలు చేయడం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, గోల్డ్ బాండ్స్‌లల్లో ఇన్వెస్టిమెంట్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

అతిపెద్ద విజయంగా..

అతిపెద్ద విజయంగా..

సత్య నాదెళ్ల వంటి బిగ్ షాట్.. గ్రోవ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల- దేశీయ స్టార్టప్ కంపెనీలకు ఊపిరి పోసినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌ మరిన్ని ఆవిర్భవించడానికి ఇది దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. సత్య నాదెళ్లతో కలిసి పని చేయడం, ఆయన దృష్టిని ఆకర్షించుకోవడం- తాము సాధించిన అతి పెద్ద విజయంగా గ్రోవ్ మేనేజ్‌మెంట్ హర్షం వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పని చేయడం థ్రిల్లింగ్‌గా ఉంటుందని లలిత్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+