ప్రమాదంలో స్టాక్ మార్కెట్.. అతిపెద్ద ముప్పు వచ్చేసిందంటున్న బ్యాంక్ ఆఫ్ అమెరికా సర్వే..

Bank of America Survey: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ షేర్ల పట్ల గ్లోబల్ పెట్టుబడిదారుల వైఖరిలో పెను మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) విడుదల చేసిన నవంబర్ ఫండ్ మేనేజర్ సర్వే ప్రకారం.. 2006 జూన్ తర్వాత ఒకే నెలలో టెక్నాలజీ స్టాక్‌లలో తమ పెట్టుబడుల వాటాను అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లు అత్యంత వేగంగా తగ్గించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 461 బిలియన్ డాలర్ల ఆస్తులను (AUM) నిర్వహిస్తున్న 169 మంది దిగ్గజ ఫండ్ మేనేజర్లు పాల్గొన్న ఈ సర్వే, టెక్ దిగ్గజాలు ఏఐ మౌలిక సదుపాయాలపై చేస్తున్న అపరిమిత వ్యయంపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనలను బయటపెట్టింది.

సర్వే గణాంకాల ప్రకారం టెక్ స్టాక్‌లలో ఫండ్ మేనేజర్ల 'నికర ఓవర్‌వెయిట్' (Net Overweight) స్థానం 37 శాతం నుండి ఏకంగా 12 శాతానికి పడిపోయింది. అంటే మదుపర్లు టెక్ రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టనప్పటికీ, తమ పోర్ట్‌ఫోలియోలలో అదనపు కేటాయింపులను గణనీయంగా కుదించుకుని అప్రమత్తత పాటిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం కంపెనీల భారీ మూలధన వ్యయం (Capex). సర్వేలో పాల్గొన్న మేనేజర్లలో 38 శాతం మంది కంపెనీలు అవసరానికి మించి అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Bank of America survey 2026 AI stocks tech stocks AI spending concerns AI bubble fears Big Tech capex Nvidia shares AI investment risks fund manager survey November 2026 technology stock selloff AI hyperscalers global stock market news AI AI AI Nvidia AI AI

సర్వే చరిత్రలోనే ఇది అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఏఐ కోసం డేటా సెంటర్లు, సర్వర్లపై ఖర్చు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఆ స్థాయిలో అమ్మకాలు, ఆదాయ వృద్ధి కనిపించకపోవడమే షేర్ల అమ్మకాలకు దారితీస్తోంది. రాబోయే ఆరు నెలల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏఐ హైపర్‌స్కేలర్ కంపెనీలు తమ క్యాపెక్స్ ప్రణాళికలను తగ్గించుకోవచ్చని లేదా వాయిదా వేయవచ్చని 52 శాతం మంది మేనేజర్లు అంచనా వేస్తున్నారు.

Also Read

ప్రస్తుతం ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఏఐ బబుల్ (AI Bubble) అని ఈ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతానికి పైగా మేనేజర్లు ప్రస్తుత ఏఐ ర్యాలీని ఒక బబుల్‌గా పరిగణిస్తుండగా, 34 శాతం మంది దీనిని మార్కెట్లకు అతిపెద్ద టెయిల్ రిస్క్‌గా గుర్తించారు. ఒకవేళ ఆదాయాలు అంచనాలను అందుకోక ఈ బబుల్ పేలిపోతే మదుపర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి తోడు, 31 శాతం మంది ఫండ్ మేనేజర్లు ఏఐ-సంబంధిత రుణ సంక్షోభాన్ని (AI-related Credit Crunch) రెండవ ప్రధాన ముప్పుగా పేర్కొన్నారు. భారీ వ్యయాల కోసం కంపెనీలు చేస్తున్న అప్పులు, రాబడి ఆలస్యమైతే ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, అమెరికన్ టెక్ స్టాక్స్ నుండి నిధులను ఉపసంహరించుకుంటున్న అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లు యూరోపియన్ మార్కెట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. రాబోయే ఒకటి నుండి మూడు నెలల్లో యూరోపియన్ స్టాక్‌లు లాభపడతాయని నికరంగా 67 శాతం మంది మేనేజర్లు అంచనా వేశారు (అక్టోబర్‌లో ఇది 44 శాతంగా ఉండేది). రాబోయే 12 నెలల్లో యూరోపియన్ ఈక్విటీలు సగటున 5.92 శాతం రాబడిని ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

యూరప్‌లో స్విట్జర్లాండ్ (30 శాతం మొగ్గు), జర్మనీ (27 శాతం) మార్కెట్లు అత్యంత ఆకర్షణీయంగా నిలవగా, ఫ్రాన్స్‌పై మదుపర్ల విశ్వాసం మైనస్ 60 శాతంతో రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. రంగాల వారీగా చూస్తే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత పెరగగా, ఆటోమొబైల్ స్టాక్‌లలో మాత్రం ఫండ్ మేనేజర్ల అండర్‌వెయిట్ స్థానం మైనస్ 47 శాతంగా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+