అంతర్జాతీయ వాణిజ్యంపై మెక్సికో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించింది. ఇప్పుడు దాని దారిలోనే మెక్సికో కూడా నడుస్తోంది. తమ దేశీయ పరిశ్రమలు, ఉత్పత్తిదారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 2026 సంవత్సరం నుండి భారతదేశం, చైనా, ఇతర ఆసియా దేశాల నుండి వచ్చే దిగుమతులపై మెక్సికో ఏకంగా 50% వరకు భారీ సుంకాల పెంపును ఆమోదించింది. మెక్సికో సెనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు.. మెక్సికోతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుండి వచ్చే సుమారు 1,400 ఉత్పత్తుల శ్రేణులపై దిగుమతి సుంకాలను పెంచుతుంది.

ఏ ఉత్పత్తులు ప్రభావితమవుతాయి?
మెక్సికో విధించిన ఈ కొత్త సుంకాలు దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై పడనున్నాయి. ముఖ్యంగా, ఆటో విడిభాగాలు, లైట్ వాహనాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, స్టీల్, గృహోపకరణాలు, బొమ్మలు, టెక్స్‌టైల్స్, ఫర్నిచర్, పాదరక్షలు (ఫుట్‌వేర్), లెదర్ వస్తువులు, కాగితం, మోటార్‌సైకిళ్లు, అల్యూమినియం, గాజు, అలాగే సబ్బులు, పెర్ఫ్యూమ్‌లు, కాస్మెటిక్స్ వంటి అనేక ఉత్పత్తుల వర్గాలు ఇందులో ఉన్నాయి. అయితే చాలా వర్గాలకు 35% వరకు సుంకాలు ఎదురవుతాయి. కానీ ప్యాసింజర్ వాహనాలు వంటి కొన్ని ఉత్పత్తులపై సుంకాలు 2026 నుండి ఏకంగా 50%కి పెరుగుతాయి. ఈ మార్పు మెక్సికో ఇండియా వాణిజ్యంపై భారీ ప్రభావం చూపనుంది.
మెక్సికో ప్రభుత్వం వాదన ఏమిటి?
మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్.. తమ దేశంలోని స్థానిక ఉద్యోగాలు, తయారీ రంగాన్ని రక్షించడానికి ఈ అధిక సుంకాలు అవసరమని వాదించింది. సెనేట్ ఎకానమీ కమిటీ చైర్మన్ ఎమ్మాన్యుయెల్ రేయెస్ మాట్లాడుతూ.. "ఈ సర్దుబాట్లు మెక్సికన్ ఉత్పత్తులను గ్లోబల్ సప్లై చైన్స్‌లో పెంచుతాయి అలాగే కీలక రంగాలలో ఉద్యోగాలను కాపాడతాయి" అని తెలిపారు. ఇది కేవలం డబ్బు సంపాదించే పద్ధతి కాదని, తమ దేశ ఆర్థిక, వాణిజ్య విధానాన్ని మార్చేందుకు ఒక సాధనం అని వారు పేర్కొన్నారు.
భారతదేశానికి పెద్ద దెబ్బ: ఆటోమొబైల్ రంగం
ఈ సుంకాల పెంపు భారతదేశానికి ఒక పెద్ద సవాలును విసిరింది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది చాలా గట్టి దెబ్బ. మెక్సికో మన దేశానికి సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మూడవ అతిపెద్ద కార్ ఎగుమతి మార్కెట్. ప్యాసింజర్ కార్లపై సుంకం 20% నుండి 50%కి పెరగనుంది. దీనివల్ల ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకి వంటి ప్రధాన భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.
భారతదేశ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (SIAM) ఈ సుంకాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఈ పెంపు భారత ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, దీనిపై మెక్సికో ప్రభుత్వంతో చర్చించాలని వారు వాణిజ్య మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. భారతీయ కార్లు మెక్సికో దేశీయ పరిశ్రమకు ఎలాంటి ముప్పు కలిగించవని, ఎందుకంటే భారతీయ వాహనాలు ఉత్తర అమెరికా మార్కెట్‌కు మెక్సికో తయారుచేసే హై-ఎండ్ కార్ల విభాగంలోకి రారని ఆటోమేకర్లు వాదించారు.
భారత్ నో రెస్పాన్స్..
విశ్లేషకుల ప్రకారం.. మెక్సికో ఈ టారిఫ్‌లను పెంచడానికి కారణం US-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA) యొక్క తదుపరి సమీక్షకు ముందు అమెరికాను సంతృప్తి పరచడం. అయితే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ఏకపక్ష సుంకాలను వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలు వాణిజ్య ప్రయోజనాలను "తీవ్రంగా దెబ్బతీస్తాయని" హెచ్చరించింది. ప్రస్తుతానికి భారతదేశం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి మున్ముందు మెక్సికో టారిఫ్స్ (Mexico tariffs India) పై మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications