For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, ఎస్బీఐతో మెర్సిడెజ్ బెంజ్ జట్టు

|

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మంగళవారం అనేక ఇతర ప్రయోజనాలతో పాటు ఆకర్షణీయ వడ్డీ రేట్ల ప్రయోజనం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ కస్టమర్లకు ఆకర్షణీయ వడ్డీ రేటుతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తోంది. అలాగే ఎస్బీఐ యోనో ద్వారా కార్లను కొనుగోలు చేసిన వారికి అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తోంది.

కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్

రూ.25 వేల అదనపు ప్రయోజనం

రూ.25 వేల అదనపు ప్రయోజనం

తమ లగ్జరీ కార్లను బుక్ చేసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకే కార్ల ఫైనాన్సింగ్, ఇతర అనేక ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనో యాప్ ద్వారా బెంజ్ కార్లను బుక్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. బెంజ్ కారు బుక్ చేసుకునే కస్టమర్లందరికీ డీలర్‌షిప్స్ వద్ద రూ.25వేల అదనపు ప్రయోజనం ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయని తెలిపింది.

కొత్త కస్టమర్లను చేరుకోవడం కోసం..

కొత్త కస్టమర్లను చేరుకోవడం కోసం..

మెర్సిడెజ్ బంజ్ కొత్త కస్టమర్లను చేరుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకోసం ఓ బ్యాంకుతో టై-అప్ కావడం ఇదే మొదటిసారి. ఎస్బీఐ-మెర్సిడెజ్ బెంజ్ డీల్ ప్రకారం దేశంలోని 17 సర్కిళ్లలోని ఎస్బీఐ హెచ్ఎన్ఐ కస్టమర్లకు మెర్సిడెజ్ బెంజ్ సహకారంతో ఆఫర్లను అందిస్తున్నట్లు ఎస్బీఐ రిటైల్ అండ్ డిజిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. పండుగ సీజన్‌లో ఈ అవకాశాన్ని ఉఫయోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆకర్షణీయ ఆఫర్లు

ఆకర్షణీయ ఆఫర్లు

ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఐదేళ్ల పదవీ కాలం ఉన్న రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుపై ఆఫర్లు అందిస్తోంది. యోనో యాప్ ద్వారా కారు బుక్ చేసుకుంటే రూ.25వేల అదనపు ప్రయోజనంతో పాటు ఎలిజిబుల్ క్రెటేరియా ఫిల్ చేస్తే మంజూరు చేసిన కారు రుణాన్ని పొందవచ్చు.

English summary

కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, ఎస్బీఐతో మెర్సిడెజ్ బెంజ్ జట్టు | Mercedes Benz ties up with SBI for car finance

Luxury car manufacturer Mercedes-Benz on Tuesday said it has partnered with State Bank of India (SBI) for car finance at ’attractive’ interest rate besides many other benefits.
Story first published: Tuesday, November 24, 2020, 18:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X