ముంబై: ఫార్మాసీ సెక్టార్‌లో అగ్రగామిగా కొనసాగుతోన్న మెడ్‌ప్లస్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ నెల 13వ తేదీన అంటే సోమవారం ఐపీఓను జారీ చేయనుంది. ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి మూడు రోజుల పాటు అవకాశం ఉంటుంది. ఈ నెల 15వ తేదీన పబ్లిక్ ఇష్యూ క్లోజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఫార్మసీ రిటైల్ చైన్ ఔట్‌లెట్స్ ఉన్న ఈ కంపెనీ.. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 1,398.29 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ప్రైస్ బ్యాండ్ ఎంత..?
ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 798.29 కోట్ల రూపాయలు, షేర్లను జారీ చేయడం ద్వారా 600 కోట్ల రూపాయలను సమీకరించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. మెడ్‌ప్లస్ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ 780 రూపాయల నుంచి 796 రూపాయలు. కటాఫ్ ప్రైస్ 796 రూపాయలు. ఫేస్ వ్యాల్యూ 2 రూపాయలు. ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 18 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 18 షేర్లను ఒక లాట్‌గా పరిగణిస్తారు. అలా గరిష్ఠంగా 13 లాట్లను కొనుగోలు చేయవచ్చు. 15వ తేదీ వరకు షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఆఫ్‌లోడ్ షేర్స్..
షోర్ ఫార్మా ఎల్ఎల్‌సీ, నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా ల్యాబ్స్, ఏ రాఘవరెడ్డి, కే ప్రకృతి, నవ్‌దీప్ పత్యాల్, సంగీత రాజు, ఆర్ వెంకటరెడ్డి, టీకే కురియన్, నిత్య వెంకటరమణి, అతుల్ గుప్తా, మనోజ్ జైస్వాల్, రాహుల్ గర్గ్, కొల్లెన్‌గుడి రామనాథన్ లక్ష్మీనారాయణ, బిజో కురియన్, తదితరులు ఓఎఫ్ఎస్ ద్వారా తమ షేర్లను ఆఫ్‌లోడ్ చేయనున్నారు.

షేర్ల వాటాలివీ..
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం మెడ్‌ప్లస్ యాజమాన్యం అయిదు కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేసింది. అర్హత గల ఉద్యోగులు.. ఈ ఐపీఓ ఫైనల్ ఆఫర్ ప్రైస్ కింద 78 రూపాయలకు షేర్లను కొనుగోలు చేయవచ్చు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం 50 శాతం వరకు పబ్లిక్ ఇష్యూలను రిజర్వ్ చేసింది కంపెనీ యాజమాన్యం. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్స్ కోసం 15 శాతాన్ని కేటాయించింది. మిగిలిన 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మంజూరు చేసింది.

పలు రాష్ట్రాల్లో ఫార్మసీ ఔట్‌లెట్స్..
దేశంలో పలు రాష్ట్రాల్లో మెడ్‌ప్లస్‌కు ఫార్మసీ చెయిన్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో సుమారు రెండువేలకు పైగా ఫార్మసీ షాప్‌లను నిర్వహిస్తోందీ కంపెనీ. అత్యధికంగా చెన్నై నుంచి 30 శాతం మేర ఆదాయం లభిస్తోంది. బెంగళూరు-29, హైదరాబాద్-22, కోల్‌కత-20 శాతం మేర లాభాలను అందిస్తున్నాయి. ఒమ్ని ఛానల్ ద్వారా మందులను సరఫరా చేసే మొట్టమొదటి ఫార్మసీ రిటైలర్‌గా మెడ్‌ప్లస్ గుర్తింపు పొందింది. 2015లో ఈ విధానాన్ని ప్రారంభించింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్‌లైన్ అమ్మకాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.

హెల్తీ బ్యాలెన్స్ షీట్..
మెడ్‌ప్లస్ సంస్థ హెల్తీ బ్యాలెన్స్ షీట్‌ను మెయింటెయిన్ చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 63.11 కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను నమోదు చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 1.79 కోట్ల రూపాయల లాభాన్ని సాధించగా.. సంవత్సరం తిరిగే సరికి ఈ మొత్తం 63 కోట్లకు పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు కూడా 2,870.6 కోట్ల రూపాయల నుంచి 3,096.26 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఆఫర్ ఓపెన్ కాకముందే గ్రే మార్కెట్ దృష్టిని ఆకర్షించినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం 300 రూపాయలుగా ఉంటోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications