ఇన్సూరెన్స్-టెక్ కంపెనీ మెడి అసిస్ట్ ఐపీఓ ఓపెన్ అయింది. మెయిన్‌బోర్డ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈరోజు ప్రారంభమైంది.ఇది 17 జనవరి 2024 వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ భీమా కంపెనీలకు థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేషన్ (TPA) సర్వీస్ ప్రొవైడర్, వైద్య బీమా, నగదు రహిత ఆసుపత్రి సేవలను అందిస్తుంది. బీమా-టెక్ కంపెనీ ఈక్విటీ షేరుకు మెడి అసిస్ట్ IPO ప్రైస్ బ్యాండ్‌ను రూ.397 నుంచి రూ.418గా నిర్ణయించారు.
ఇదిలా ఉండగా మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ షేర్లు వారాంతం నుంచి గ్రే మార్కెట్‌లో ట్రేడ్‌కు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ఈ రోజు గ్రే మార్కెట్‌లో మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ షేర్లు రూ.32 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి.
బిడ్డింగ్ మొదటి రోజు 11:42 నాటికి 0.14 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ భాగం 0.27 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. బుక్ బిల్డ్ ఇష్యూ ఎన్ఐఐ భాగం 0.05 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది.

మెడి అసిస్ట్ పబ్లిక్ ఇష్యూ నుంచి రూ.1,171.58 కోట్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 100 శాతం ఆఫర్ ఫర్ సేల్. అంటే వచ్చిన మొత్తం ప్రమోటర్లకే వెళ్లనుంది. ఈ ఐపీఓకు అప్లై చేయాలంటే.. కనీసం 35 షేర్లు కొనుగోలు చేయాలి. షేరు కేటాయింపు జనవరి 18న జరగనుంది. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ పబ్లిక్ ఇష్యూకి అధికారిక రిజిస్ట్రార్‌గా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానుంది.
మెడి అసిస్ట్‌ను సాక్షి కబ్రా 2002లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిగా.. 2011లో బెస్సెమర్ వెంచర్స్ వాటాలు కొనుగోలు చేసింది. అదే ఏడాది అనిల్ అంబానీ గ్రూప్ 80 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తర్వాత మెజారిటీ వాటాను ఇన్వెస్టర్‌కార్ప్‌కు విక్రయించినట్లు కంపెనీ ఆర్హెచ్పీలో పేర్కొంది.


Click it and Unblock the Notifications