Medi Assist Healthcare IPO: వచ్చే వారం రానున్న ఐపీఓ ఇదే.. బంపర్ లిస్టింగ్ అవుతుందా..!
బీమా కంపెనీలకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ సేవలను అందించే మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ వచ్చే వారం ఐపీఓకు రానుంది. ఇది 2024 సంవత్సరంలో రెండో అతిపెద్ద IPO వస్తోంది. జ్యోతి CNG IPO (జ్యోతి CNC ఆటోమేషన్ IPO) 2024 మొదటి పెద్ద IPO గా ఉంది. మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ IPO జనవరి 15న ఓపెన్ కానుంది. పెట్టుబడిదారులు జనవరి 17, 2024 వరకు IPO కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ IPO ద్వారా మార్కెట్ నుంచి రూ.1,172 కోట్లను సమీకరించనుంది. మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 397- రూ.418గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్లు జనవరి 12న షేర్ల కోసం వేలం పొల్గొనవచ్చు. మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ IPOలో అన్ని షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. కంపెనీ ప్రమోటర్లు, పెట్టుబడిదారులు IPO లో 2.8 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ ప్రమోటర్లు విక్రమ్ జీత్ సింగ్ చత్వాల్, మెడిమీటర్ హెల్త్ మేనేజ్‌మెంట్, బెస్సెమర్ హెల్త్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌సి షేర్లను విక్రయిస్తున్నాయి. ఇది కాకుండా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కూడా ఆఫర్ ఫర్ సేల్‌లో వాటాలను విక్రయించబోతోంది. IPOలో, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డబ్బు సమీకరించనుంది. IPOలో, సంస్థాగత పెట్టుబడిదారులకు 50 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 35 శాతం,నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం వాటాను కేటాయించారు.
బెంగళూరుకు చెందిన మెడి అసిస్ట్ హెల్త్ కేర్ ఒక ఆరోగ్య-టెక్, ఇన్సర్‌టెక్ కంపెనీగా ఉంది. ఇది యజమానులు, రిటైల్ సభ్యులు, ప్రజారోగ్య పథకాలపై దృష్టి సారిస్తుంది. యాక్సిస్ క్యాపిటల్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్, IIFL సెక్యూరిటీస్, SBI క్యాపిటల్ మార్కెట్లు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహిస్తున్నాయి. ఈ స్టాక్ BSE, NSEలలో షేర్ల లిస్ట్ కానుంది.


Click it and Unblock the Notifications