McDonald's: ఒకవైపు చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారనే వార్తల మధ్య క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ గొప్ప శుభవార్తను ప్రకటించింది. కంపెనీ భారత విభాగంలో (నార్త్ అండ్ ఈస్ట్) త్వరలోనే 5,000 మందిని నియమించుకోనున్నట్లు సోమవారం ప్రకటన చేసింది.

భవిష్యత్తు విస్తరణ..
కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో ఉత్తర, తూర్పు భారదేశంలో తమ స్టోర్లను తెరవాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లోని 300 రెస్టారెంట్లను అధిగమించేందుకు తమ అవుట్‌లెట్లను రెట్టింపు చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం 5,000 మందిని కంపెనీ నియమించుకుంటుందని ఆయన వెల్లడించారు.

అతిపెద్ద రెస్టారెంట్..
భారతదేశంలో అతిపెద్ద రెస్టారెంట్‌ను సోమవారం నాడు కంపెనీ గౌహతిలో ప్రారంభించింది. దీనిని 6,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 220 మందికి అతిథులు కూర్చుని విందు చేసేందుకు వీలుగా నిర్మించింది. కంపెనీ వేగంగా వృద్ధి బాటలో పయనిస్తున్నందున తన నెట్‌వర్క్‌ను విస్తరించాలని కంపెనీ నిర్ణయించినట్లు మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ అండ్ ఈస్ట్) మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ స్పష్టం చేశారు.

కొత్త భాగస్వామి ఎంపిక..
2020లో US ఫాస్ట్ ఫుడ్ చైన్ MMG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ అగర్వాల్‌ను ఉత్తర, తూర్పు భారతదేశంలో అవుట్‌లెట్లను నిర్వహించడానికి తన కొత్త భాగస్వామిగా ఎంపిక చేసింది. ఈ సంస్థ పాత భాగస్వామి విక్రమ్ బక్షి నుంచి 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. గతంలో బక్షితో ఉన్న న్యాయపరమైన గొడవను కంపెనీ పరిష్కరించుకున్నట్లు రంజన్ వెల్లడించారు. దీంతో ఉత్తర, తూర్పు భారతంలో సంజీవ్ అగర్వాల్ నేతృత్వంలోని MMG గ్రూప్.. దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ఫ్రాంచైజీని BL జాటియా నేతృత్వంలోని వెస్ట్‌లైఫ్ గ్రూప్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర, తూర్పు భారతంలో కంపెనీకి 156 రెస్టారెంట్ల ఉన్నాయని రెంజన్ వెల్లడించారు.

నియామకాల ప్రణాళిక..
కంపెనీ రానున్న మూడేళ్ల కాలంలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు రంజన్ తెలిపారు. ఈశాన్య భారతదేశానికి గేట్‌వేగా ఉన్న గౌహతి భవిష్యత్ విస్తరణ అవకాశాలతో తమకు వ్యూహాత్మక ప్రదేశమని ఆయన వెల్లడించారు. అందుకే ఈశాన్య భారతంలో మరిన్ని ఔట్‌లెట్లను తెరిచేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడిస్తూ మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications