టెక్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. ప్రముఖ కంపెనీలు దశలవారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కోతలు జరుగుతూనే ఉన్నాయి. దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయం, గ్లోబల్ వైడ్ గా నెలకొన్న అస్థిర పరిస్థితులు ఉద్యోగులతో పాటు కంపెనీలను కూడా ఆందోళన బాటలోకి నెట్టేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాల కోతలు భారీగానే జరుగుతున్నాయి. టెక్ రంగానికి నిలయమైన సిలికాన్ వ్యాలీని వందలాది మంది ఉద్యోగులు విడిచిపెట్టారు.
2025 మొదటి త్రైమాసికంలో యూఎస్ కార్మిక రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో భారీగానే ఉద్యోగులను కంపెనీలు తీసివేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు 1.5 లక్షలకుపైగా ఉద్యోగాలకు కంపెనీలు పింక్ స్లిప్పులు ఇచ్చాయి. పరిశ్రమల్లో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడితో పాటు ఖర్చు తగ్గింపు చర్యలు ఈ లేఆప్స్ కి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

రానున్న జూన్ నెలలో కూడా భారీగా లేఆప్స్ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అమెరికాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయే అవకాశం ఉందని న్యూస్‌వీక్ తెలిపింది. దాదాపు 138 కంపెనీలు లేఆప్స్ ను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ కంపెనీల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వారు ఉద్యోగులకు ఈ విషయం తెలిపినట్లు సమాచారం. వేరే జాబ్ చూసుకోవాలని కూడా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక మే నెల విషయానికి వస్తే 130 కంపెనీలు ఉద్యోగులను తొలిగించాయి. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఈయూ దేశాల మీద తీసుకున్న సుంకాల బాదుడుతో ఉద్యోగాలు ప్రశ్నార్థకంలో పడ్డాయి. యూరోపియన్ యూనియన్ దేశాలపై వాణిజ్యపరంగా ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. 50 శాతం సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది జూన్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది.
జూలై 9 నుంచి ఈ సుంకాల బాదుడు అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కూడా ఆర్థిక మాంద్య భయాల నుండి బయటపడేందుకు కసరత్తు చేస్తున్నాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోతలు కూడా దీనిలో భాగంగానే చెప్పుకోచ్చు. కొన్ని కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటే మరికొన్ని కంపెనీలు మాత్రం ఉత్పత్తులకు సరైన డిమాండ్ లేకపోవడంతో నష్టాల బాట నుంచి తప్పించుకునేందుకు లేఆప్స్ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రంగాల్లో లేఆప్స్ నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) వాషింగ్టన్ కార్యాలయం నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తీసేసిన ఉద్యోగులు సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని ది సియాటిల్ టైమ్స్ నివేదిక తెలిపింది.ఈ సారి లేఆఫ్స్ ప్రకటనలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు ప్రభావితం అయ్యారని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications