కరోనా మహమ్మారితో కుదేలైన ఆటోరంగం జూలై మాసంలో కాస్త కోలుకుంది. ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో భారీగా పడిపోయిన వాహన సేల్స్ క్రమంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో నెల.. జూలైలో విక్రయాలు పెరిగాయి. భారత దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీతో పాటు హీరోమోటా కార్ప్ ఆశాజనక సేల్స్‌ను నమోదు చేసింది. ఇది ఈ రంగానికి, ఈ రంగంలోని ఉద్యోగులకు మంచి ఊరటగా చెప్పవచ్చు. జూన్ నెలతో పోలిస్తే టాప్ 5 కారు కంపెనీల సేల్స్ 80 శాతం పెరిగాయి.

పెరిగిన మారుతీ సుజుకీ సెల్స్
ఏడాది ప్రాతిపదికన మారుతీ సుజుకీ డొమెస్టిక్ సేల్స్ 1.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం సేల్స్ మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది జూలై నెలలో 98,210 వాహనాలు విక్రయించిన ఈ కంపెనీ, గత నెలలో మాత్రం విక్రయం 1,00,000 యూనిట్లు దాటింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా మే నెలలో సేల్స్ కేవలం 13,865గా ఉన్నాయి. జూన్ మాసంలో 51,274 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ తన మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను మే 12వ తేదీ నుండి ప్రారంభించింది.

వ్యక్తిగత రవాణా కోసం కార్లు కొనేవారు పెరుగుతున్నారు
చిన్నకార్లు, ఆల్టో, ఎస్ ప్రెస్సో అమ్మకాలు 49.1 శాతం పెరిగి 11,577 వాహనాల నుండి 17,258కి చేరుకున్నాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్ బాలెనో, డిజైర్ అమ్మకాలు 10.4 శాతం తగ్గి 51,529కు క్షీణించాయి. విటారా, బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా విక్రయాలు 26.3 శాత వృద్ధితో 19,177గా ఉన్నాయి. కరోనా, సామాజిక దూరం వంటి కారణాలతో వ్యక్తిగత రవాణా కోసం కార్లను వినియోగించే వారి సంఖ్య పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మాసంతో పోలిస్తే జూలైలో ఊపందుకున్నాయని, వచ్చేది పండుగ సీజన్ కావడంతో మరింత పెరగవచ్చునని అంటున్నారు.

మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్ సేల్స్ జూమ్
మారుతీ సుజుకీతో పాటు హీరో మోటో కార్ప్ విక్రయాలు గత ఏడాది జూలై స్థాయికి చేరుకున్నాయి. స్ల్పెండర్ సేల్స్ జూలైలో 5 లక్షలు దాటాయి. అంతకుముందు నెలతో పోలిస్తే 14 శాతం పెరిగి, గత ఏడాది జూలైతో పోలిస్తే తగ్గి 5,14,509 టూవీరల్స్ సేల్ అయ్యాయి. హ్యుండాయ్ దేశీయ విక్రయాలు కేవలం 2 శాతం మాత్రమే తగ్గాయి. కరోనా నుండి ఇప్పుడిప్పుడే వాహన పరిశ్రమ కోలుకుంటోందనేందుకు ఈ గణాంకాలు నిదర్శనమని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, కిర్లోస్కర్ మోటార్, అమ్మకాలు పెద్ద మొత్తంలో తగ్గాయి.

ఏ కంపెనీ కార్లు, ఎన్ని సేల్ అయ్యాయి
- మారుతీ సుజుకీ గత ఏడాది 1,09,264 కాగా, కేవలం 1.1 శాతం క్షీణించి 1,08,064గా ఉన్నాయి. టోటల్ డొమెస్టిక్ సేల్స్ అయితే పెరిగాయి.
- హ్యుండాయ్ మోటార్స్ - గత ఏడాది 57,310గా ఉండగా ఈసారి 28 శాతం తగ్గి 41,300గా ఉన్నాయి. ఇవి మొత్తం విక్రయాలు.
- మహీంద్రా అండ్ మహీంద్రా - గత ఏడాది 40,140 యూనిట్లు కాగా 36 శాతం తగ్గి 25,678 యూనిట్లుగా ఉంది. ఇవి మొత్తం విక్రయాలు
- టయోటా కిర్లోస్కర్ - గత ఏడాది 10,423 నుండి ఈసారి 5,386కు క్షీణించాయి. 48.32 శాతం క్షీణించింది. ఇవి దేశీయ విక్రయాలు మాత్రమే.
- ఎంజీ మోటార్ - గత ఏడాది 1,508 కాగా ఈసారి 40 శాతం వృద్ధి సాధించి 2,105గా ఉన్నాయి.
- హోండా కార్స్ ఇండియా దేశీయ సేల్స్ గత ఏడాది 10,250 కాగా, ఈసారి 47.48 శాతం క్షీణించి 5,383కు తగ్గాయి.
టూవీలర్ సేల్స్
- హీరో మోటా కార్ప్ సేల్స్ గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈసారి 3.97 శాతం మాత్రమే తగ్గి 5,35,810 నుండి 5,14,509కు క్షీణించాయి.
- సుజుకీ మోటార్ సైకిల్ సేల్స్ గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈసారి 50 శాతం తగ్గి 69,236 నుండి 34,412కు క్షీణించాయి.
- రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈసారి 26 శాతం తగ్గి 54,185 నుండి 40,334కు క్షీణించాయి.
- టీవీఎస్ మోటార్స్ సేల్స్ గత ఏడాది జూలై నెలతో పోలిస్తే ఈసారి 10 శాతం తగ్గి 2,79,465 నుండి 2,52,744కు క్షీణించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications