ముంబై: దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం అయ్యాయి. వాటి ధరలకు రెక్కలు మొలిచాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. కొత్త సంవత్సరం తొలి నెలలోనే దీనికి ముహూర్తం పడింది. దేశంలో అత్యధికంగా విక్రయం అయ్యే కార్ల తయారీ కంపెనీగా పేరున్న మారుతి సుజుకితో ఈ పెరుగుదల ప్రారంభం కానుంది.

మారుతి సుజుకి వాహన రేట్లకు రెక్కలు..
మారుతి సుజుకి వాహనాల ధరలు పెరిగాయి. తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు మారుతి సుజుకి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. వాహనాల రేట్లను పెంచినట్లు ప్రకటించింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లను పెంచినట్లు స్పష్టం చేసింది. 0.1 శాతం నుంచి 4.3 శాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది.
కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.

ఇన్‌పుట్ భారాన్ని కొంతమేరకైనా..
ఈ భారాన్ని కొంతమేరకైనా పంచుకోవాలనే ఉద్దేశంతోనే వాహన ధరలను పెంచాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకి తేల్చి చెప్పింది. మారుతి సుజుకిలో బేసిక్ కార్ మోడల్‌గా పేరున్న ఆల్టో మొదలుకుని ఎస్-క్రాస్ వరకు అన్ని వాహనాల రేట్లనూ సవరించింది.
3.15 నుంచి 12.56 లక్షల రూపాయల వరకు వాటి రేట్లు ఉన్నాయి. గత సంవత్సరం మారుతి సుజుకి యాజమాన్యం మూడు సార్లు కార్ల రేట్లను పెంచింది. జనవరి-1.4, ఏప్రిల్-1.6, సెప్టెంబర్-1.9 శాతం మేర పెంచింది.

ఇప్పుడు ఏకంగా..
ఇప్పుడు మళ్లీ అదే ఆనవాయితీని అనుసరించింది. గతంతో పోల్చుకుంటే- ఈ దఫా ఏకంగా 4.3 శాతం వరకు కార్ల రేట్లను పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్లు, ఇతర వాహనాల తయారీ, సెకెండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడం.. వాటిని విక్రయించడం, ఆటోమొబైల్ స్పేర్ పార్టులు, ఇతర కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ సెక్టార్‌లో దేశంలోనే టాప్ బ్రాండింగ్ ఉన్న కంపెనీగా ఆవిర్భవించింది. దేశంంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు, ఇతర వాహనాల విక్రయించే సంస్థగా పేరుంది మారుతి సుజుకికి.

భారీగా నెట్ ప్రాఫిట్..
నిజానికి- విడిభాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్ల మారుతి సుజుకికి పెద్దగా నష్టం కూడా వచ్చిన సందర్భం లేదు. జూన్ 30వ తేదీ నాటికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించిన మేర నెట్ ప్రాఫిట్‌ను అందుకుందా కంపెనీ. 475 కోట్ల రూపాయల మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే- నెట్ ప్రాఫిట్ అసాధారణంగా పెరిగినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి త్రైమాసిక కాలానికి 268.30 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మారుతి సుజుకి చవి చూసింది.

విడిభాగాల ధరలతో..
విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్‌పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో- కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ఒక కారును తయారు చేయడానికి అవసరమైన స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, కాపర్, ఇతర విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నాంటూ మారుతి సుజుకి ముందు నుంచీ చెబుతూ వస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications