Maruti Suzuki: రూ.125 డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకి..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 3,878 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 48 శాతం పెరిగింది. గత మూడు నెలల్లో కార్ల తయారీ సంస్థ రూ. 38,235 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలతో పాటు ఒక్కో షేరుకు రూ. 125 డివిడెండ్‌ను ప్రకటించింది.
కంపెనీ తన అత్యధిక వార్షిక అమ్మకాల పరిమాణం, ఎగుమతులు, నికర అమ్మకాలు, నికర లాభం సాధించిందని ఎక్సేజ్ ఫైలింగ్ లో పేర్కొంది. మారుతి సుజుకి వార్షిక విక్రయాల పరిమాణం 2 మిలియన్ యూనిట్లను అధిగమించి, వరుసగా మూడవ సంవత్సరం PVలను ఎగుమతి చేసే అగ్రగామిగా నిలిచింది. మారుతీ సుజుకి 2030 నాటికి 8 లక్షల యూనిట్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. FY25లో దాని విదేశీ ఎగుమతులు 3 లక్షల యూనిట్లను దాటగలవని నమ్మకంగా ఉంది.

రెండు నెలల్లోపు రానున్న కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అసాధారణ స్థాయికి నడిపిస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు ఛైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు.మారుతీ సుజుకి ఇటీవలే హర్యానాలోని తన మానేసర్ ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 1 లక్ష యూనిట్లకు విస్తరించింది. దీనితో యూనిట్‌లో సంవత్సరానికి మొత్తం సామర్థ్యాన్ని 9 లక్షల వాహనాలకు తీసుకువెళ్లారు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2 మిలియన్ యూనిట్ల వార్షిక మొత్తం విక్రయాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది.
అంతేకాకుండా, ఇది వరుసగా 3వ సంవత్సరం అగ్ర ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ఇప్పుడు భారతదేశం నుంచి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో 41.8 శాతం వాటాను కలిగి ఉంది. ఏప్రిల్ 26న బిఎస్‌ఇలో మారుతీ సుజుకి షేర్లు 1.26 శాతం తగ్గి ఒక్కొక్కటి రూ.12,760 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications