దీపావళి పండుగను టార్గెట్ చేసిన మారుతి.. భారీగా ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు జరపాలని ప్లాన్
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ పండుగ సీజన్‌లో తన ఎంట్రీ-లెవల్ కార్ల మార్కెట్‌ను తిరిగి చైతన్యవంతం చేయడానికి పెద్ద ప్లాన్ వేస్తోంది. ధరల తగ్గింపులు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, రెండు చక్రాల వాహనదారులను నాలుగు చక్రాల యజమానులుగా మార్చే వ్యూహంతో, కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తన ప్రముఖ చిన్న మోడళ్లైన ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలను రికార్డు స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ ప్రణాళికలతో పరిచయం ఉన్న వర్గాల ప్రకారం.. మారుతి 2026 ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షల నుండి 2.5 లక్షల మినీ కార్లు విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. FY20లో 2.47 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదవడం ఇప్పటివరకు అత్యధికం కాగా ఈ సంఖ్యను అధిగమించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవలి సంవత్సరాల్లో SUV లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా చిన్న కార్ల మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ, GST తగ్గింపు రూపంలో వచ్చిన అవకాశాన్ని మారుతి సుజుకి ఉపయోగించుకోవాలని చూస్తోంది. చిన్న కార్లపై పన్ను రేటు 18 శాతనికి తగ్గడంతో ధరలు 11 నుంచి 13 శాతానికి తగ్గాయి. దీని వల్ల తక్కువ బడ్జెట్ వినియోగదారులు, ద్విచక్ర వాహనదారులు ఆకర్షితులవుతారని కంపెనీ ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో Maruti Suzuki ప్రారంభ మోడళ్లపై నెలకు కేవలం రూ. 1,999 EMIతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ నవరాత్రి సమయంలో ప్రారంభమై దీపావళి వరకు కొనసాగుతుంది.ఈ EMI స్కీమ్ చాలా ప్రభావవంతంగా ఉంది. అనేకమంది ద్విచక్ర వాహన యజమానులు తొలిసారి షోరూమ్‌లకు వస్తున్నారని మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
డీలర్లు కూడా ఈ వ్యూహాన్ని సమర్థిస్తున్నారు. గ్రామీణ, చిన్న పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో విచారణలు వస్తున్నాయి. ధంతేరాస్, దీపావళి సమయానికి బుకింగ్‌ల ఉత్సాహం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాని పశ్చిమమ భారతదేశంలోని ఒక మారుతి డీలర్ చెప్పారు.బెనర్జీ ప్రకారం.. అక్టోబర్‌లో ఆల్టో బుకింగ్‌లు గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 60 శాతం పెరిగాయి. చిన్న కార్ల GST సడలింపులు, తక్కువ EMIలు మొదటిసారి కొనుగోలు చేసేవారిని ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు.
అయితే, పరిశ్రమ నిపుణులలో కొందరు మారుతి లక్ష్యాలు సాధ్యమని నమ్మడం లేదని ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో మొదటిసారి కారు కొనేవారు కూడా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడుతున్నారు. బడ్జెట్ మోడళ్లపై ఆసక్తి తగ్గిందన్నారు. అయినప్పటికీ, విశ్లేషకులు మారుతి వ్యూహాన్ని దీర్ఘకాల దృష్టిలో సానుకూలంగా చూస్తున్నారు. నోమురా రీసెర్చ్ ప్రకారం..ధరల కోతలు స్వల్పకాలంలో లాభదాయకతను తగ్గించినప్పటికీ, దీర్ఘకాలంలో మార్కెట్ వాటాను విస్తరించడంలో, ఆపరేటింగ్ లివరేజ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలిపారు.
GST తగ్గింపు చిన్న కార్ల విభాగాన్ని మళ్లీ రేకెత్తిస్తుంది. ఫైనాన్సింగ్ మరియు ఉత్పత్తి ఆవిష్కరణల కొత్త తరంగం రావచ్చు. భారతదేశంలో 1,000 మందికి కేవలం 36 కార్లు మాత్రమే ఉన్నందున, ఇది ద్విచక్ర వాహన యజమానులను నాలుగు చక్రాల వైపు నడిపించే పెద్ద అవకాశంగా మారవచ్చని ఎస్ అండ్ పి గ్లోబల్ మొబిలిటీ డైరెక్టర్ పునీత్ గుప్తా అభిప్రాయపడ్డారు:
మారుతి ఇప్పటికే తన కార్ల ధరలను 2 శాతం నుండి 21 శాతం వరకు తగ్గించింది. అందులో ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో వంటి మోడళ్లపై 13 నుంచి 22 శాతం భారీ కోతలు ఉన్నాయి. పెద్ద SUVలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఇన్విక్టో లపై 2 నుంచి 8 శాతం తగ్గింపులు అమలు చేసింది. మేము అన్ని విభాగాలలో సమతుల్య ఉనికిని కొనసాగిస్తాము. నాయకత్వం అంటే కేవలం SUVలలో కాదు, హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు, CNG, హైబ్రిడ్‌లు, EVలలో కూడా ఉండాలని బెనర్జీ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications