ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 2) లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 293.20 పాయింట్లు లేదా 0.88% లాభపడి 33,596.72 వద్ద, నిఫ్టీ 84.95 పాయింట్లు లేదా 0.86% లాభపడి 9,911.10 వద్ద ప్రారంభమైంది. లాభాల్లోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 240 పాయింట్ల లాభానికి తగ్గింది. టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, ఐవోసీ, మారుతీ సుజుకీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ ఉన్నాయి. మెటల్ తప్పించి మిగతా రంగాలు అన్ని లాభాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 75.08 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ షేర్ల దూకుడు
ఎన్ఎస్ఈలో 24 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ, ఆల్కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, సిప్లా, దివిస్ లేబోరేటరీస్, డిక్సన్ టెక్నాలజీస్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

22 ఏళ్ల తర్వాత తొలిసారి మూడిస్ తగ్గింపు
లాక్ డౌన్ సడలింపులు ఎత్తివేయడం వంటి వివిధ కారణాలతో మార్కెట్లు పుంజుకున్నాయి. నిన్న సెన్సెక్స్ ఏకంగా 879.42 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 245.85 పాయింట్లు లాభపడింది. అయితే ఆ తర్వాత భారత రుణ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ తగ్గించింది. ఈ ప్రభావం మార్కెట్లపై ఉండే అవకాశాలు తక్కువ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత సార్వభౌమ రుణ రేటింగును మూడిస్ ఇన్వెస్టర్స్ 22 ఏళ్లలోనే ఇంతలా తగ్గించడం తొలిసారి. తక్కువ వృద్ధి, ఆర్థిక స్థితిగతుల క్షీణత వల్ల ఆర్థిక రంగ ఒత్తిడిని తగ్గించేందుకు సవాళ్లు ఎదుర్కోక తప్పదని తెలిపింది. దేశానికి గతంలో కేటాయించిన బీఏఏ2 నుండి బీఏఏ3కి రుణ రేటింగ్‌ను తగ్గించింది. భారత విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయర్ రేటింగ్స్ కూడా బీఏఏ2 నుండి బీఏఏ3కు తగ్గించింది. 22 ఏళ్ల తర్వాత మూడీస్ మొదటిసారి తగ్గించింది.

ప్రభావం ఉండకపోవచ్చు
మూడీస్ Baa3కు తగ్గించింది. ఇది కనిష్ట పెట్టుబడి గ్రేడ్. భారత్‌కు క్లిష్ట పరిస్థితులు అని మూడీస్ పేర్కొంది. ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టార్‌కు సంక్షోభం ఎదుర్కోనుందని అభిప్రాయపడింది. అయితే మూడిస్ ఈ గ్రేడింగ్ తగ్గించినా అంతగా ప్రభావం చూపకపోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మూడిస్ గతంలో 1998లో ఈ రేటింగ్ తగ్గించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications