SEBI on Anil Ambani: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిల్ అంబానీకి చెందిన కంపెనీల షేర్లు తిరిగి పుంజుకుంటున్న వేళ తరచుగా ఆయన పేరు వార్తల్లో వినిపిస్తోంది. పతనం నుంచి తిరిగి తేరుకుంటున్న అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ కఠిన చర్యలు ప్రకటించటం నేడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది వ్యక్తులపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అలాగే అనిల్ అంబానీకి సెబీ రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ మొత్తం విషయం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుండి డబ్బు మళ్లింపుకు సంబంధించినది.

శుక్రవారం SEBI అనిల్ అంబానీతో పాటు 24 మంది వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంది. మార్కెట్‌లో నమోదైన ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా కంపెనీ డైరెక్టర్ లేదా ఇతర మేనేజర్ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించకుండా అనిల్ అంబానీని సెబీ నిషేధించింది. ఇదే క్రమంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్(RHFL)పై కూడా సెబీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు సెబీ నిషేధించింది. అంతేకాకుండా కంపెనీకి రూ.6 లక్షల జరిమానా కూడా విధించారు.
అనిల్ అంబానీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలోని ముఖ్య నిర్వాహక సిబ్బంది సహాయంతో అనుబంధ సంస్థకు రుణాల రూపంలో నిధుల మళ్లింపుకు కుట్రపన్నినట్లు సెబీ గుర్తించింది. RHFL బోర్డు సభ్యులు ఇటువంటి రుణ విధానాలను నిలిపివేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కార్పొరేట్ రుణాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినప్పటికీ, కంపెనీ యాజమాన్యం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని వెల్లడించింది. అనిల్ అంబానీ ప్రభావంతో కొందరు కీలక నిర్వాహకులు చేసిన పని తీరులో పెద్ద పొరపాటు జరిగిందని సెబీ పేర్కొంది. దీనికి తోడు మిగిలిన సంస్థలు చట్టవిరుద్ధంగా పొందిన రుణాల గ్రహీతలుగా లేదా RHFL నుంచి అక్రమంగా నిధులను మళ్లించే ప్రక్రియలో పాత్ర పోషించాయని రెగ్యులేటర్ తెలిపింది.
ఆదాయాలు, నగదు ప్రవాహం, ఎటువంటి ఆస్తులు కలిగి లేని కంపెనీలకు వందల కోట్ల రుణాలను మంజూరు చేయడంలో RHFL యాజమాన్యం, ప్రమోటర్ల నిర్లక్ష్య వైఖరిని సెబీ తన ఉత్తర్వుల్లో తప్పుపట్టింది. దీని వెనుక ఏదో ప్రమాదకరమైన ఉద్దేశ్యం ఉందని ఇది చూపిస్తుంది. ఈ రుణగ్రహీతల్లో చాలా మంది ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని పరిగణనలోకి తీసుకున్నప్పుడు పరిస్థితి మరింత అనుమానాస్పదంగా ఉందని సెబీ తెలిపింది. అలాగే ఈ రుణగ్రహీతల్లో చాలా మంది తమ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే విషయాన్ని సెబీ హైలైట్ చేసింది. దీనివల్ల అంబానీకి చెందిన హోమ్ ఫైనాన్స్ కంపెనీ తన సొంత రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది.
సెబీ నిషేధిత 24 మందిలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ ఉన్నారు. అనిల్ అంబానీతో పాటు వీరికి కూడా సెబీ జరిమానా విధించింది. అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్‌పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు పెనాల్టీ పొందారు. అలాగే రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ ఎల్‌టి, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా మిగిలిన సంస్థలపై ఒక్కొక్కటి రూ.25 కోట్ల జరిమానా విధించబడింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications