ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమై, సాయంత్రానికి నష్టాల్లో ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం వరకు నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు నష్టపోయి 30,380 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 8,925 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 1429 షేర్లు లాభాల్లో, 940 నష్టాల్లో ఉండగా, 174 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఉదయం మార్కెట్ ప్రారంభం..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి రావడం, చైనా డేటా ఊరట కలిగించడం వంటి వివిధ కారణాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 534.07 పాయిట్లు (1.74%) ఎగిసి 31,224.09 వద్ద, నిఫ్టీ 155.10 పాయింట్లు (1.72%) పెరిగి 9148.95 వద్ద ప్రారంభమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో hdfc బ్యాంకు, హిండాల్కో, యూపీఎల్, సన్ ఫార్మా, లార్సన్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతీ సుజుకీ ఉన్నాయి. ప్రధానంగా మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో ఉన్నాయి.

కాగా, అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలు చూశాయి. చైనా ట్రేడ్ డాటా అంచనాల కంటే బెట్టర్‌గా వచ్చిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్స్ లాభపడ్డాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా ఉండే అవకాశముంది. అలాగే, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధించిన వివిధ దేశాలు ఎత్తివేతలు లేదా సడలింపు దిశగా సాగుతున్నాయి. ఇవి కూడా మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications