ITR News: పన్ను చట్టంలోని ఆదాయపు పరిమితులు దాటిన వ్యక్తులు ప్రతి ఏటా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొత్త టాక్స్ రీజిమ్ కింద రూ.7 లక్షల వార్షిక ఆదాయం దాటిన వ్యక్తులు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పాత పన్ను రీజిమ్ కింద లిమిట్ దాటిన వ్యక్తులు తమ రిటర్న్స్ దాఖలు చేయక తప్పదు. అయితే ఈ క్రమంలో చాలా మంది పన్ను చెల్లింపు దారులు చేస్తున్న తప్పుడు నిర్ణయాలు వారికి చట్టపరమైన సమస్యలను కలిగిస్తోంది
చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ పన్ను బకాయిని తగ్గించుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఎక్కువ మెుత్తంలో టాక్స్ రిఫండ్స్ పొందాలనే దురాశతో ప్రొఫెషనల్స్ కాని వ్యక్తులను ఆశ్రయిస్తుంటారు. ఎక్కువ రిఫండ్ ఇప్పిస్తామంటూ వారి వాగ్ధానాలతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని వెల్లడైంది. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు తమ రిటర్న్‌లలో నకిలీ విరాళాలకు సంబంధించిన చెల్లింపు రశీదులు, ఖర్చులు, హౌస్ రెంట్ పేమెంట్స్ మొదలైనవాటిని చూపించి వాపసు పొందిన ఉదంతాలు చాలా చోట్ల బయటపడ్డాయి. ఈ వాస్తవాలు బయటకు రావటంతో రీఫండ్స్ విషయంలో ప్రస్తుతం పన్ను శాఖ కఠినంగా వ్యవహరించటం ప్రారంభించింది. అయితే దీనికి మూలకారణం చాలా మంది పన్ను చెల్లింపుదారులు నాన్ ప్రొఫెషనల్స్ ద్వారా పన్ను చెల్లింపులను తగ్గించుకోవటానికి అక్రమ మార్గాలను అన్వేషించటమే.

నాన్ ప్రొఫెషనల్స్ ఎక్కువ పన్ను వాపస్ వచ్చేలా చేస్తామని పన్ను చెల్లింపుదారులకు ఎరవేస్తున్నట్లు తేలింది. అయితే చివరికి టాక్స్ పేయర్స్ చట్టపరమైన నోటీసులు అందుకోవటం, న్యాయపరమైన చిక్కుల్లోకి రావటం వంటివి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు పన్ను శాఖ సైతం ఐటీ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తోంది. తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ కనుగొంటూ కఠినంగా వాటిపై దర్యాప్తును పన్ను శాఖ నిర్వహిస్తోంది. అలాగే ఏదైనా ఒక ఏజెన్సీ నుంచి సమిష్టిగా ITR ఫైల్ చేస్తున్న అటువంటి ఉద్యోగులపై పర్యవేక్షణ పెరుగుతుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో ఏఐ టూల్స్ వినియోగించి అనుమానాస్పద రిటర్న్ లను పరిశీలిస్తోంది. అలాగే గత 9 ఏళ్లలో రిటర్న్‌లు పరిశీలనలో ఉన్న పన్ను చెల్లింపుదారులను డిపార్ట్‌మెంట్ నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.
ప్రస్తుతం పన్ను శాఖ నాన్-ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా దాఖలు చేసే రిటర్న్స్ విషయంలో అప్రమత్తమైంది. వీరి ద్వారా క్లెయిమ్ చేయబడిన రీఫండ్‌లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచబడుతున్నాయి. అలాగే పన్ను చెల్లింపుదారు చేసిన రీఫండ్ క్లెయిమ్ తప్పు అని తేలితే గత నాలుగేళ్లుగా పన్ను శాఖ అందించిన రిఫండ్స్ తిరిగి వెనక్కి పొందే హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉందని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.
పన్ను టాక్స్ రిఫండ్ స్టేటస్ చెక్ చేయటం ఎలా..?
- ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ www.incometax.gov.inలో పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడిగా పాన్ కార్డ్ వివరాలతో పాటు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- అక్కడ మై అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిటర్స్ స్టేటస్ తెరచి అక్కడ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎంచుకోండి.
- ఇక్కడ రిసీట్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఐటీఆర్‌కి సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది.
ఇక్కడ పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పన్ను శాఖ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ-మెయిల్ ద్వారా వాపసు లేదా ఏదైనా అదనపు సమాచారం లేదా నోటీసును పంపుతుంది. ఒకవేళ ఐటీఆర్ స్టేటస్ రీఫండ్ క్లెయిమ్ తిరస్కరించబడిందని చూపిస్తే, పన్ను చెల్లింపుదారు రీఫండ్‌ను తిరిగి జారీ చేయమని అభ్యర్థించవచ్చు. ఈ క్రమంలో ఏదైనా సహాయం అవసరమైతే 1800-103-4455కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected]కి ఈ-మెయిల్ చేయడం ద్వారా వారిని సంప్రదించి సూచనలు పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications