Gold: ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన దేశం ఏదో తెలుసా..!
భారతీయులు బంగారం కొనుగోలు చేయడం సెంటి మెంటగ్ గా భావిస్తారు. ఎంత పేదవారైనా గ్రాము బంగారమైన కొంటారు. అందుకే భారత్ పసిడి భారీగా దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏ తెలుసా.. చాలా మంది అమెరికా, చైనా అనుకుంటారు. కానీ వరల్డ్ భారతీయుల వద్దే భారీగా బంగారం ఉంది. భారతీయ ప్రజల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ భారత స్థూల దేశీయోత్పత్తినే (GDP) మించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ప్రజల వద్ద దాదాపు 34 వేల నుంచి 35 వేల టన్నుల వరకు బంగారం నిల్వలు పలువురు పేర్కొంటున్నారు. అయితే కచ్చిమైన నంబర్ కాదు.
ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ5 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. అంటే ప్రజల వద్ద బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల బంగారం ఉందన్నమాట. మన కరెన్సీలో చూస్తే దాదాపు రూ. 450 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది మన దేశ జీడీపీ కంటే ఎక్కువ. భారత్ తమ అవసరాల కోసం, ప్రజల డిమాండ్‌కు తగ్గట్లుగా అందుబాటులో ఉంచేందుకు ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇందుకోసం భారీగా విదేశీ మారక నిల్వలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మన సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ వద్ద కేవలం 880 టన్నుల బంగారమే ఉంది. కానీ ప్రజల వద్ద భారీగా పసిడి ఉంది.

యూఎస్ఏ సెంట్రల్ బ్యాంక్ వద్ద అత్యధికంగా బంగారం నిల్వలు ఉండగా.. ఆ తర్వాత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, భారత్, టర్కీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిపితే 26,500 టన్నుల బంగారాన్ని నిల్వలు అవుతాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే భారతీయుల వద్ద ఉన్న పసిడి అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో దాదాపు 11 - 16 శాతం వరకు ఇండియాలోనే ఉంది. 2026 నాటి అంచనాల ప్రకారం భారతదేశ జనాభా సుమారు 140 కోట్లు. మొత్తం బంగారం 34 వేల 600 టన్నల బంగారం అనుకుంటే.. ఒక్కరికి సగటున 23.5 గ్రాముల బంగారం పంచవచ్చు.
బంగారం భారతీయులను ధనవంతులను చేస్తోందని కొంత మంది చెబుతున్నారు. భారతీయులకు ముందు చూపు ఎక్కువ అని.. అందుకే ఏళ్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని ఓ విదేశీ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు పెరిగినా భారతీయులు బంగారం కొనుగోలు తగ్గించడం లేదని చెబుతున్నారు. అన్నింట్లో ముందుండాలని ప్రయత్నించే చైనా కూడా బంగారం విషయంలో భారత్ కంటే వెనకబడిందని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications