ఫిబ్రవరి 8న మ్యాన్‌కైండ్ ఫార్మాకు సంబంధించి 24 బ్లాక్ డీల్స్‌లో దాదాపు 6.49 మిలియన్ షేర్లు లేదా 1.62 శాతం వాటా మారిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. డీల్‌కు సంబంధించిన కొనుగోలుదారులు ఎవరు అనేది తెలియరాలేదు. మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రమోటర్లు శీతల్ అరోరా, అర్జున్ జునేజా, పూజ జునేజా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ అవసరాలకు అనుగుణంగా కంపెనీలో 1.62 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు మనీకంట్రోల్ పేర్కొంది.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని లిస్టెడ్ సంస్థలు కనీసం 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి. ఈ బ్లాక్ డీల్ లో ఒక్కో షేరుకు రూ. 2,050 ఫ్లోర్ ధరతో దాదాపు రూ. 1,330 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఈ ఒప్పందంలో సలహాదారులుగా వ్యవహరించాయి. గత ఆరు నెలల్లో మ్యాన్‌కైండ్ ఫార్మా స్టాక్ దాదాపు 20 శాతం పెరిగింది.

ఫిబ్రవరి 7 నాటికి మొత్తం ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ షేర్ హోల్డింగ్ కంపెనీ మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 76.5 శాతంగా ఉంది. విక్రయం పూర్తయిన తర్వాత, రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం కంపెనీలో మొత్తం ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ షేర్ హోల్డింగ్ ఇప్పుడు 74.88 శాతానికి తగ్గింది. ప్రస్తుతానికి శీతల్ అరోరా కంపెనీలో 5.27 శాతం వాటాను కలిగి ఉండగా, అర్జున్ కు 2.64 శాతం, పూజ జునేజాకు వ 3.45 శాతం వాటాలు ఉన్నాయి.
మ్యాన్‌కైండ్ ఫార్మా మే 2023లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. దాని ప్రారంభ ఇష్యూ ధర రూ.1,080కి 32 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది.
మ్యాన్ కైండ్ ఫార్మాకు స్టాక్ గురువారం 4 శాతం పెరిగింది. అంటే రూ. 85 పెరిగి రూ.2,213 ట్రేడవుతోంది.
Note: ఇది కేవలం వార్త మాత్రమే. దీనికి గుడ్ రిటర్స్న్ తెలుగుకు సంబంధం లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications