పౌరసత్వ సవరణ చట్టం, కాశ్మీర్‌పై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్పింది. ఆ దేశం నుంచి రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు నిలిపివేసింది. మలేషియా నుంచి అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునే దేశం భారత్. కానీ ఆ దేశం తీరును నిరసిస్తూ భారత్ దిగుమతులు నిలిపివేసింది.

చిన్నవాళ్లం.. ప్రతీకారం తీర్చుకోలేం
పామాయిల్ దిగుమతులను భారత్ నిలిపివేయడంపై మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ మూడు రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశం నుంచి దిగుమతులు నిలిపివేసినప్పటికీ ప్రతీకారం తీర్చుకునేంత శక్తి తమకు లేదని, తాము చాలా చిన్నవాళ్లమని, ఈ సమస్య నుంచి అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నామన్నారు.

భారత్ దెబ్బకు...
భారత్ అంతర్గత అంశాలపై మలేసియా స్పందించిన తీరుతో భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెండు దేశాల మధ్య విభేదాలకు దారి తీసింది. ఇది మలేషియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వివాదాన్ని సామరస్యంగా లేదా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పరిష్కరించుకునేందుకు మలేషియా సిద్ధపడింది.

చక్కెర కొనుగోళ్లు పెంచాలని నిర్ణయం
ఇందులో భాగంగా భారత్ నుంచి చక్కెర కొనుగోళ్లు పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్ అంటే జనవరి-మార్చిలో భారత్ నుంచి 49.20 మిలియన్ డాలర్ల విలువైన 1,30,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేయనున్నట్లు ఎంఎస్ఎం మలేషియా హోల్డింగ్స్ బెర్హాడ్ తెలిపింది.

భారత్‌ను శాంతింపచేసే ప్రయత్నం
2019లో ఈ కంపెనీ భారత్ నుంచి 88,000 టన్నుల ముడి చక్కెరను కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తి సంస్థ ఎఫ్‌జీవీ హోల్డింగ్స్‌కు చెందిందే ఎంఎస్ఎం మలేషియా హోల్డింగ్స్. పామాయిల్ దిగుమతులను నిలిపివేయడంతో చక్కెర కొనుగోళ్లు పెంచాలని అధికారికంగా ప్రకటించనప్పటికీ భారత ప్రభుత్వాన్ని శాంతింప చేసే ప్రయత్నాల్లో భాగమని భావిస్తున్నారు.

ఆ వ్యాఖ్యలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
కొద్ది రోజుల క్రితం ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మలేషియా ప్రధాని జమ్ము కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ చట్టంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. దీంతో భారత్ దిగుమతులపై ఆంక్షలు విధించింది. మలేషియా నుంచి పామాయిల్ కొనుగోలు చేయవద్దని వ్యాపారులను ఆదేశించింది. భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారు మలేషియా. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

చక్కెర ఉత్పత్తిదారు ఇండియా
పామాయిల్‌ను మలేషియా, ఇండోనేషియాలు ఎక్కువగా ఎగుమతి చేస్తాయి. భారత్‌కు ఎక్కువగా మలేషియా నుండి వస్తుంది. గత ఏడాది 4.4 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు దిగుమతి అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. దిగుమతుల వ్యాల్యూ 6.4 బిలియన్ డాలర్లు. మరోవైపు ఇండియా అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. మిగులు నిల్వలు ఉన్నాయి. చెరకు రైతుల కోసం కేంద్రం చక్కెర మిల్లులకు పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చింది. చక్కెర ఎగుమతులకు ఈ సబ్సిడీ ప్రకటించింది. ఇప్పుడు మలేషియా చక్కెరని కొనుగోలు చేస్తే శుభపరిణామం. మరి పామాయిల్ విషయంలో భారత్ ఏం చేస్తుందో తెలియాలి.

పెరిగిన వంటనూనె ధర
కాగా, ఈ నెలలో పామాయిల్ దిగుమతులు తగ్గించడంతో వంట నూనెల ధరలు పెరిగాయి. నెల రోజుల్లోనే దాదాపు 15 శాతం పెరిగాయి. డిసెంబర్ 10వ తేదీ నుంచి పది కిలోల ముడి పామాయిల్ ధర రూ.731.40 ఉండగా జనవరి నాటికి రూ.839.80కి చేరుకుంది. మలేషియా ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో రిఫైన్డ్ పామాయిల్‌ను భారత్ నిషేధిత జాబితాలో చేర్చింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications