ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు కూడా భారీ స్థాయిలో రానున్నాయి. నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తొమ్మిదవ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సుమారు రూ. 20,216 కోట్ల విలువ గల నాలుగు ప్రాజెక్టులను ఈ సమావేశంలో మంత్రి వర్గం ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి.
ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నాలుగు సంస్థల నుండి ఈ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ నాలుగు సంస్థలు డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రెసిడెన్షియల్, సేవల రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా 50,600 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ మొదటి దశలో రూ.1,466 కోట్లు, రెండవ దశలో రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం రూ.16,466 కోట్ల పెట్టుబడితో ఏపీలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ను డేటా, డిజిటల్ సేవల గమనంలో ముందుకు తీసుకెళ్లే చిహ్నంగా నిలవనుంది. ఇక సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.
రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. మరో కంపెనీ బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ఎనర్జీ రంగంలోకి పెట్టుబడులు పెడుతోంది. రూ.1,250 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును ఏపీలో ప్రారంభించనుంది. మరో కంపెనీ ఎఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నం, మధురవాడలో నూతన సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక సేవల కేంద్రాలను ప్రారంభించనుంది.
ఇప్పటి వరకు SIPB ద్వారా మొత్తం 113 ప్రాజెక్టులకు రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, ఈ పెట్టుబడులు నూతన పరిశ్రమలకు బీజం వేస్తాయని SIPB అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ 113 ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ త్వరలో దేశంలోనే పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పన, పరిశ్రమల అభివృద్ధి, డిజిటల్ రంగంలో విస్తరణతో ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోనుందని తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గం త్వరలోనే ఐటీ, ఐటీయేతర పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందబోతుందని.. తద్వారా సుమారు 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, భూ పంపిణీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై లోకేష్ అధికారులతో చర్చించారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 2,000 అర్హతగల కుటుంబాలకు స్థలాలు కేటాయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మిగిలిన భూముల పటాల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని, అలాగే అవసరమైతే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. గృహ నిర్మాణంపై దృష్టిపెట్టిన లోకేష్, నియోజకవర్గంలోని అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 10,000 టిడ్కో ఇళ్ల నిర్మాణం అవసరముందని గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టుకు తగిన భూముల గుర్తింపు తక్షణమే చేపట్టాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులు ముందుకు సాగాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications