జూన్ 1 నుండి కొత్త రూల్స్! పాన్ కార్డ్, యూపీఐ, శాలరీ రూల్స్ అన్నీ మారిపోతున్నాయి!

మే నెల ముగిసి జూన్ నెల రానే వచ్చేసింది. ప్రతి నెల మొదటి తేదీ లాగే, ఈసారి కూడా జూన్ 1 నుండి దేశంలో ఆర్థిక, బ్యాంకింగ్ , పన్ను రంగాలలో చాలా కీలకమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టాలు, యూపీఐ పేమెంట్లు, ఏటీఎం చార్జీల నుండి గ్యాస్ సిలిండర్ ధరల వరకు చాలా విషయాల్లో కొత్త నిబంధనలు (New rules) స్టార్ట్ అవుతున్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి కాబట్టి, అసలు ఏమేం మారుతున్నాయో ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Major Financial Changes From June 1 New Rules For UPI PAN HRA And Advance Tax Deadline

1. జూన్ 15 లోపు అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సిందే!

కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 కింద, ఈ ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించి మొదటి అడ్వాన్స్ టాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి జూన్ 15, 2026 చివరి తేదీ. ఎవరికైనా ఏడాదికి నెట్ టాక్స్ లయబిలిటీ రూ. 10,000 దాటితే, వారు తమ అడ్వాన్స్ టాక్స్‌లో 15 శాతాన్ని ఈ తేదీ లోపు కట్టేయాలి. ఒకవేళ ఈ డెడ్‌లైన్ మిస్ అయితే.. ప్రతి నెల 1 శాతం చొప్పున వడ్డీ పెనాల్టీ పడుతుంది సుమా!

2. శాలరీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

పాత పన్ను విధానంలో (Old Tax Regime) ఉండే ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని కీలక మినహాయింపులను భారీగా పెంచింది.

  • చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్: ఇప్పటివరకు నెలకు కేవలం రూ. 100 గా ఉన్న ఈ మినహాయింపును ఏకంగా రూ. 3,000 కి పెంచారు.
  • హాస్టల్ అలవెన్స్: దీనిని కూడా నెలకు రూ. 9,000 కి పెంచడం జరిగింది.
  • హెచ్‌ఆర్‌ఏ (HRA) ఊరట: హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను కూడా 50% హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు కేటగిరీలోకి అధికారికంగా చేర్చారు. దీనివల్ల ఐటీ ఉద్యోగులకు టాక్స్ బాగా మిగులుతుంది.

3. యూపీఐ (UPI) లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. మోసాలకు చెక్!

ఇకపై మీరు ఎవరికైనా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసినా లేదా మొబైల్ నంబర్ కొట్టి డబ్బులు పంపాలన్నా.. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్న అసలు పేరు (Verified Name) స్క్రీన్ మీద కనిపిస్తుంది. యూజర్లు పెట్టుకునే నకిలీ పేర్లు లేదా అలియాస్ టాగ్స్ ఇకపై కనిపించవు. దీనివల్ల పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపే ఛాన్స్ ఉండదు. అలాగే, ఈపీఎఫ్‌ఓ (EPFO) నుండి నేరుగా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు.

4. పెరగనున్న ఏటీఎం (ATM) చార్జీలు!

డిజిటల్ పేమెంట్లు ఒకవైపు సులువు అవుతున్నా, సాంప్రదాయ బ్యాంకింగ్ మాత్రం కాస్త ఖరీదు కాబోతోంది. జూన్ 1 నుండి కొన్ని ప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఏటీఎం చార్జీలను సవరిస్తున్నాయి. దీనివల్ల ఏటీఎంలో లిమిట్ దాటి నగదు విత్‌డ్రా చేసినా, మినీ స్టేట్‌మెంట్ చూసినా, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి రావచ్చు.

5. గ్యాస్ ధరల సమీక్ష & స్మాల్ సేవింగ్స్ రేట్లు

ప్రతి నెల ఒకటో తేదీ లాగే, ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ (LPG), సీఎన్‌జీ (CNG) ధరలను జూన్ 1న సమీక్షించనున్నాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో ఈ నెల రేట్లు ఎలా ఉంటాయా అని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వడ్డీ రేటును 7.1%, సుకన్య సమృద్ధి యోజన రేటును 8.2% వద్దే ఈ త్రైమాసికానికి మార్చకుండా స్థిరంగా ఉంచారు.

6. ఆస్తుల కొనుగోలుపై కొత్త పాన్ (PAN) రూల్స్

ఆస్తి లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు (New rules) అమల్లోకి వచ్చాయి. ఇకపై రూ. 20 లక్షల లోపు జరిగే చిన్న చిన్న ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరం లేదు (గతంలో ఈ లిమిట్ రూ. 10 లక్షలు ఉండేది). అయితే ఆస్తి విలువ రూ. 45 లక్షలు దాటితే మాత్రం పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. అలాగే ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేసినా ఐటీ శాఖకు రిపోర్ట్ వెళ్తుంది.

7. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి అలర్ట్!

జూన్ 1 నుండి కొత్త సోలార్ ప్యానెల్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లేదా నెట్-మీటరింగ్ సౌకర్యం పొందాలంటే.. కేవలం ప్రభుత్వం ఆమోదించిన లిస్ట్ (ALMM) లో ఉన్న సోలార్ మోడ్యూల్స్ మాత్రమే వాడాలి. దీనివల్ల ప్రారంభంలో సోలార్ ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కొంచెం పెరిగినా, నాణ్యమైన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూశారుగా.. జూన్ నెలలో మారే రూల్స్ ఇవే, కాబట్టి మీ పనులను ఇప్పుడే సరిగ్గా ప్లాన్ చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+