మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ఏడాదిలో వాహనాల ధరలను పెంచనుంది. పాసింజర్ వెహికిల్, కమర్షియల్ వెహకిల్ ధరలను జనవరి 1 (2021) నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించింది. పెరిగిన ముడి వనరుల ధరల భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. అయితే ఏ వాహనంపై ఎంత ధరలు పెంచుతున్నారో వెల్లడించాల్సి ఉంది.
ముడి వనరులు పెరగడం వల్ల వాహన తయారీ సంస్థలు ఆర్థికంగా మరింత భారాన్ని మోస్తున్నాయి. దీంతో వాహన ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి. జనవరి 1వ తేదీ నుండి తమ కార్లపై మూడు శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ఫోర్డ్ కంపెనీ గతంలోనే ప్రకటించింది. జనవరి నుండి ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ కూడా తెలిపింది. మోడల్స్‌ను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.

మహీంద్రా కొనుగోలుదారులకు నెలాఖరు వరకు కార్లపై తగ్గింపు బంపరాఫర్ ప్రకటించింది. 2020 ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఇటీవల ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటించింది. వివిధ కార్లపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. డిసెంబర్ నెల చివరి వరకు మాత్రమే ఈ రాయితీలు ఉంటాయి. దాదాపు అన్ని రకాల మోడల్స్ పైన కొత్త కారు కొనుగోలు చేయాలనే వారికి మహీంద్రా శుభవార్త చెప్పింది. అయితే వచ్చే ఏడాది నుండి ధరలు పెరుగుతుండటం గమనార్హం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications