ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన దూకుడును పెంచింది. కిందటి వారమే ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700)ను మార్కెట్‌లోకి గ్రాండ్‌గా విడుదల చేసిన ఈ టాప్ ఆటోమొబైల్ కంపెనీ.. సరిగ్గా వారం తిరిగే సరికి కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహీంద్రా బొలెరో నియో ఎన్10 (ఓ) (Mahindra Bolero Neo N10 (O)ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఫీచర్లను వెల్లడించింది.
ఎస్‌యువీ సెగ్మెంట్‌లో హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్‌లతో పాటు తన సొంత బ్రాండ్ మహీంద్ర టీయూవీ 300లకు పోటీగా బొలెరో నియో ఎన్10 (ఓ)ను రోడ్డుపైకి తీసుకొచ్చిందా కంపెనీ మేనేజ్‌మెంట్. ఇదివరకే బొలెరో నియో ఎన్4, ఎన్8, ఎన్10 మోడళ్లను కొనుగోలుదారుల కోసం విడుదల చేసింది. అదే సీక్వెన్స్‌లోన బొలెరో నియో ఎన్ 10 (ఓ)ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర 10 లక్షల 69 రూపాయలుగా నిర్ధారించింది.

అయిదు రంగుల్లో లభిస్తుందీ మోడల్ కారు. రాకీ బీజ్, మెజస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెరల్ వైట్, నపోలీ బ్లాక్ కలర్‌లల్లో అందుబాటులో ఉంది. మల్టీ టెర్రయిన్ టెక్నాలజీ దీని సొంతం. మ్యానువల్ లాక్ డిఫరెన్షియల్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. దాదాపుగా నియో ఎన్10 మోడల్ వెహికల్‌లో అందుబాటులో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. మ్యానువల్ లాక్ డిఫరెన్షియల్ సిస్టమ్ అదనంగా ఈ కొత్త మోడల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.
1.5 లీటర్ల ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఇది. 3,750 రివాల్యూషన్ పర్ మినిట్‌తో కూడిన 100 బ్రేక్ హార్స్ పవర్, 260 ఎన్ఎం టార్క్ 5- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఈ ఇంజిన్ ప్రత్యేకత. ఇప్పటిదాకా కూడా ఈ వేరియంట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమేటిక్ గేర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టలేదు. దీని ఇంధన ట్యాంకు సామర్థ్యం 50 లీటర్లు. ఏడు ఇంచ్‌ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, అత్యాధునిక కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications