బంగ్లాదేశ్ నుంచి కరోనా ఔషధం... భగ్గుమంటున్న ఇండియన్ ఫార్మా కంపెనీలు!

కరోనా వైరస్ చికిత్స కు ఉపయోగించే ఒక కీలక ఔషధాన్ని బంగ్లాదేశ్ కు చెందిన ఒక ఫార్మా కంపెనీ నుంచి కొనుగోలు చేయటం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. ప్రపంచానికే ఔషధాలను సరఫరా చేసే భారత ఫార్మా కంపెనీలను కాదని ఒక అనామక కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇవ్వటం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్న రెమ్డేసివీర్ అనే ఔషధం కొనుగోలుపై ప్రస్తుతం ఈ వివాదం నెలకొంది.

దీనికి కారణమైందిమహారాష్ట్ర ప్రభుత్వం కావటం విశేషం. కరోనా వైరస్ కు ఇండియన్ వుహాన్ నగరంలా మారిన ముంబై నగరంతో పాటు మహారాష్ట్ర లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. వీరికి చికిత్స అందించేందుకు హైడ్రోక్సీక్లోక్సిన్ తో పాటు రెమ్ డెసివీర్ ఔషధాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఔషధానికి ఇండియాలో అనుమతి లేకపోవటంతో బంగ్లాదేశ్ ఫార్మా కంపెనీ నుంచి కొనుగోలు చేయనున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులతో కొనుగోలు చేస్తామని చెప్పటంతో దుమారం చెలరేగింది.

ధర కూడా అధికమే...

ధర కూడా అధికమే...

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కు చెందిన ఎస్కాఎఫ్ ఫార్మా కంపెనీ నుంచి రెమ్డెసివీర్ ఔషధాన్ని కొనుగోలు చేయాలనీ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోటి రూ 12,000 చొప్పున మొత్తం 10,000 వయల్స్ ఔషధాన్ని కొనుగోలు చేస్తారు. అయితే ఎస్కాఎఫ్ ఫార్మా కంపెనీ తమ సొంత దేశంలో విక్రయిస్తున్న ధరలతో పోల్చితే ఇది రెట్టింపు కావటం వివాదానికి మరో కారణంలా కనిపిస్తోంది. సదరు కంపెనీకి ఇండియా కు ఔషధాలను దిగుమతి చేసే లైసెన్స్ కూడా లేకపోవటం మరో విశేషం. ఒకటేమో అసలు ఔషధానికే అనుమతి లేదు. రెండోది కంపెనీ కి దిగుమతి లైసెన్స్ లేదు. మూడోది ధర లేమో రెట్టింపు ఉండటం. ఇంకా మన దేశం లో బోలెడన్ని ఫార్మా కంపెనీలు ఉండటం ఇవన్నీ ఈ కాంట్రాక్టుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

మేం అనుమతించలేదు..

మేం అనుమతించలేదు..

ఇదిలా ఉండగా... రెమ్డెసివీర్ ఔషధ హక్కులు కలిగిన గిలియడ్ సైన్సెస్ అనే కంపెనీ ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన వివరణలో తాము ఎస్కాఎఫ్ ఫార్మస్యూటికల్స్ సహా బంగ్లాదేశ్ లోని ఏ ఇతర సంస్థ కు కూడా రెమ్డెసివీర్ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతించలేదు అని పేర్కొంది. దీంతో వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. మొత్తం దేశానికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి, ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయటమేమిటని ఇండియన్ ఫార్మా కంపెనీలు నిలదీస్తున్నాయి. ఫార్మా రంగ విశ్లేషకులు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేని విదేశీ సంస్థ నుంచి హడావిడిగా, అధిక ధరలకు డ్రగ్ కొనుగోలు చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావటం లేదని అంటున్నారు.

ఇండియా లో రూ 7,000 కు లభ్యం...

ఇండియా లో రూ 7,000 కు లభ్యం...

గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమ్డెసివీర్ ఔషధాన్ని భారత్ లో అధికారికంగా ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఔషధం అందుబాటులో ఉంది. దీనికి మన సంస్థలు చెబుతున్న ధర రూ 7,000 మాత్రమే కావటం విశేషం. పైగా ఈ ఔషధం మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా... కొన్నేళ్లుగా భారత ఫార్మా రంగానికి బంగ్లాదేశ్ ఫార్మా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. ఎగుమతి మార్కెట్లలో అది ప్రస్ఫుటమవుతోంది. ప్రపంచంలో మూడో వంతు ఔషధాలను తయారు చేయటంతో పాటు ఎగుమతి చేసే ఇండియన్ ఫార్మా కంపెనీలకు వీటితో కొత్త తలనొప్పి వచ్చేలా ఉందని భావిస్తున్నారు. ఇక నేరుగా ఆ కంపెనీలకు ఇండియా లో అనుమతులిస్తే మన దేశీయ కంపెనీలకు కీడు చేసినట్లేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరోనా పేరుతో దొడ్డిదారిన ఇండియా లోకి ప్రవేశించే వ్యూహాలను ఆదిలోనే అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+