జర్మనీ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ భారత్-జర్మనీ మధ్య నేటి నుండి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. భారత ప్రభుత్వంతో వివాదం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి పొందిన విమానాల సంఖ్యపై కేంద్రంతో వివాదం తలెత్తింది. దీంతో జర్మనీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు అన్ని ఇండియా-జర్మన్ విమానాలను క్యాన్సిల్ చేసినట్లు లుఫ్తాన్సా తెలిపింది.
జర్మనీతో చేసుకున్న ఎయిర్ బబూల్ ఒప్పందంలో భాగంగా లుఫ్తాన్సా భారత్-జర్మనీ మధ్య వారానికి 20 సర్వీసులు నడుపుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. భారత్కు చెందిన విమానాలను మాత్రం కేవలం మూడు నుండి నాలుగు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన భారత సర్వీసులకు గణనీయమైన ప్రతికూలత ఎదురవుతోందని తెలిపింది. దీంతో వారానికి ఏడు విమానాలను మాత్రమే నడపాలని లుఫ్తాన్సాకు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనకు లుఫ్తాన్సా నో చెప్పింది.

ఈ అంశానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, యూఏఈ, మాల్దీవులు, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఖతార్, బహ్రెయిన్, నైజీరియా, ఇరాక్, ఆప్గనిస్తాన్, జపాన్.. 13 దేశాలతో భారత్కు ఎయిర్ బబుల్స్ ఒప్పందాలు ఉన్నాయి. ఇతర దేశాలతోను ఈ ఒప్పందాలను పరిశీలిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications