కరోనా మహమ్మారి కారణంగా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ వ్యాప్తంగా భారీగా పడిపోతున్నాయి. క్రూడ్ ఉత్పత్తి దేశాలు ఈ నెల నుండి ప్రొడక్షన్ తగ్గించుకుంటున్నాయి. అయినప్పటికీ లాక్ డౌన్ లేదా జనజీవనం ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోవడంతో చమురు ధరలు తగ్గుతున్నాయి. ఏకంగా 15 డాలర్లకు కూడా చేరుకొని, 21 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ ప్రభావవంతమైన ధరలు మాత్రం లేవు. మరి చమురు ధరలు తగ్గడం భారత్‌కు మంచిదేనా?

ఆర్థిక వ్యవస్థకు సానుకూలం
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు చమురు ధరల తగ్గుదల సానుకూలమే. ఆర్బీఐ డేటా ప్రకారం 2019-20 డిసెంబర్ క్వార్టర్‌లో జీడీపీలో 0.2 శాతంతో ఇండియా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రతికూలంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.7 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య పరికరాల దిగుమతి పెరుగుతున్నందున CAD ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉపకరిస్తుంది.

పడిపోతున్న కరెన్సీ విలువ
మార్చి 7వ తేదీ నుండి చూస్తే డాలర్ మారకంతో భారత కరెన్సీ విలువ 3.34 శాతం వరకు పడిపోయింది. ఇది CADను ప్రభావితం చేస్తుంది. మార్చి 27, 2020 నాటికి ఆర్బీఐ వద్ద 475.6 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. మార్చి 2019 నుండి 62.7 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. మందగమనం, కరోనా వల్ల దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థకి చమురు ధరల తగ్గుదల ప్రయోజనం.
దేశంలో ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ (FPI)లు 300 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి.

ఆదాయానికి ఈసారి గండి
చమురు ధరలు తక్కువగా ఉంటే ద్రవ్యోల్భణానికి కూడా సహకరిస్తుంది. అయితే చమురు ధరల తగ్గుదల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడినట్లే. అయితే అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినట్లుగా ఇక్కడ తగ్గడం లేదు. ప్రభుత్వానికి దాదాపు 90 శాతం ఎక్సైజ్ డ్యూటీ చమురు నుండి వస్తుంది. కస్టమ్స్ మినహాయించి 2018-19లో చమురు ఆదాయం రూ. 2,63,812 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ పైన రూ.3 పెంచినప్పటికీ రూ.14,000 కోట్లు తక్కువగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ పడిపోవడం వల్ల నష్టపోతోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications