బ్యాంకు ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం, మంచి పేరు. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆర్థిక నైతికత, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలు ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల SBI బ్యాంకులో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి, అతని సిబిల్ స్కోర్ కారణంగా చివర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఘటన, యువతలో ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనతో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

తమిళనాడుకు చెందిన అభ్యర్థి SBI సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుకు ఎంపికయ్యాడు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థి సిబిల్ (CIBIL) రిపోర్ట్ ను బ్యాంకు పరిశీలించగా, 2018-19లో తీసుకున్న మూడు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బకాయిలు వంటి అనేక చెల్లింపుల్లో డిఫాల్ట్‌లు ఉన్నట్లు బయటపడ్డాయి. ఇంక అభ్యర్థి నియామక ఉత్తర్వు రాకముందే తన బకాయిలను క్లియర్ చేశానని తెలిపినా, మద్రాసు హై కోర్టు "క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్" అనేది కేవలం బకాయిలు తీర్చడమే కాదు, సమయానికి అన్ని చెల్లింపులు చేయడం కూడా అవసరమని స్పష్టం చేసింది. ఈ తీర్పు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తోంది అని హైకోర్టు తెలియజేసింది.
ఈ సంఘటన ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తమ క్రెడిట్ స్కోర్‌ను, రుణ చెల్లింపులను శ్రద్ధగా నిర్వహించాలి. ఈ తీర్పు ఒక్క ఎస్బిఐ బ్యాంకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగాల నియమకాలలో ఈ మార్పు మార్గదర్శకంగా నిలుస్తుంది.
గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు:
- క్రెడిట్ స్కోర్ కేవలం లోన్లు కోసం మాత్రమే కాదు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలకూ కీలకం అయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోనే కాకుండా, ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను చూసే ప్రాధాన్యత పెరుగుతోంది.
- బ్యాంకు ఉద్యోగులు ప్రజల డబ్బును, నిధులను నడిపించే బాధ్యత కలవారు కాబట్టి వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ అత్యంత కీలకం.
- సమయానికి లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం. ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవడం తగ్గించడం, సిబిల్ రిపోర్ట్‌ను తరచూ తనిఖీ చేయడం చేస్తూ ఉండాలి.
- విద్యార్థి దశ నుంచే ఆర్థిక నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్నా, సమయానికి చెల్లించే అలవాటు చేసుకోవాలి.
గుడ్ న్యూస్..ఈ నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు..?
ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తోంది. ఇప్పుడు ఉద్యోగం దాకా కూడా మన క్రెడిట్ స్కోర్ ప్రభావం చూపిస్తోంది. అందుకే, మనం మన ఫైనాన్షియల్ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. టైమ్‌కు లోన్ EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం అవసరం. ఇది భవిష్యత్తులో మంచి అవకాశాలు రావడానికి సహాయపడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications