ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీవన ఖర్చులు పెరుగుతున్న వేళ, రోజువారీ వినియోగ వస్తువులు జీఎస్టీ ధరల తగ్గింపు సామాన్యులకు ఒక ఊరటగా మారనుంది. ముఖ్యంగా, రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులపై 12% నుండి 5%కి జీఎస్టీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది త్వరలో GST కౌన్సిల్ సమావేశంలో పరిగణనలోకి రానుంది. ఈ జాబితా ప్రాథమిక స్థాయిలో రూపొందించబడినదే కానీ ఇది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ సమీక్ష అనంతరం వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుత జీఎస్టీ స్లాబ్‌లు:
భారత దేశంలో నాలుగు ప్రధాన జీఎస్టీ స్లాబ్‌లు 5%, 12%, 18%, 28% ఉన్నాయి. ఇప్పుడు 12% స్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను లేదా మొత్తం ఆ స్లాబ్ ను 5% స్లాబ్‌కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల ఆ వస్తువులపై పన్ను తగ్గి, మార్కెట్‌లో ధరలు తగ్గే అవకాశం ఉంది.
12% స్లాబ్‌లో ఉన్న ముఖ్యమైన వస్తువులు:
కండెన్స్డ్ మిల్క్ (Condensed Milk), చీజ్ (Cheese), డ్రైడ్ ఫ్రూట్స్ (Dry Fruits), జామ్, ఫ్రూట్ జ్యూస్ బాటిల్, పాస్తా, 20 లీటర్ వాటర్ బాటిల్స్, కాంటాక్ట్ లెన్సెస్, సైకిళ్లు, ఫీడింగ్ బాటిల్స్, గొడుగులు, రూ. 1,000 లోపు చెప్పులు, స్లిప్పర్లు, కాటన్ హ్యాండ్బ్యాగ్స్, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్, విద్యా సంబంధిత స్టేషనరీ, మ్యాప్స్, గ్లోబ్స్.
ఎందుకు తగ్గిస్తున్నారు జీఎస్టీ?
మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయ గలవారు ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా నెలవారీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. పల్లె ప్రాంతాల్లో రోజువారీ వస్తువులపై ఎక్కువ టాక్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని 5%కి తేల్చడం వల్ల మరింత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ధరల పెరుగుదల (Inflation) అదుపులో ఉంచేందుకు పన్ను తగ్గింపు ఒక కీలక వ్యూహంగా కేంద్రం తీసుకుంటోంది.
జీఎస్టీ తగ్గితే సాధారణ కుటుంబాలకు మంచి ఉపశమనం కలుగుతుంది. టూత్‌పేస్ట్, వంట పాత్రలు, బట్టలు, పాదరక్షలు వంటి రోజూ ఉపయోగించే వస్తువులపై పన్ను తగ్గితే, నెలకు రూ. 200 నుంచి రూ. 500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్టూడెంట్స్ ఉపయోగించే స్టేషనరీ, షూస్, బైసికల్స్ వంటి వాటిపై కూడా జీఎస్టీ తగ్గితే వారి కుటుంబాలపై భారం తక్కువ అవుతుంది. ఇవి తక్కువ ధరలకు దొరుకుతాయంటే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మెరుగవుతుంది. ఉదాహరణ: రూ. 100 విలువైన టూత్‌పేస్ట్‌పై ఇప్పటి వరకు రూ. 12 GST (రూ. 112 మొత్తం) ఉండేది. ఇప్పుడు రూ. 5 మాత్రమే (రూ.105 మొత్తం) అవుతుంది.
మీ రోజువారీ దినచర్య లో ఉపయోగించే అనేక వస్తువుల ధరలు 5%-7% వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది నెలవారీ బడ్జెట్‌లో స్పష్టమైన మార్పు తీసుకురావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు. ధరలు తక్కువగా ఉండడం వల్ల వినియోగం పెరిగే అవకాశం ఉంది, దీని వల్ల చిన్న వ్యాపారాలు, రిటైల్ మార్కెట్‌కు కూడా లాభం.
అలాగే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రూ. 40,000-50,000 కోట్ల వరకు తాత్కాలిక ఆదాయ నష్టాన్ని కలగనుంది. కానీ ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీర్ఘకాలంలో వినియోగం పెరగడం వల్ల ఆదాయం తిరిగి పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications