Salary Hike: కరోనా మహమ్మారి తర్వాత చాలా కాలానికి కంపెనీలు తమ ఉద్యోగులకు తీపి కబురు చెబుతున్నాయి. కొవిడ్-19 వల్ల భారీగా నష్టపోయిన విమానయాన సంస్థలు ప్రస్తుతం తమ ఉద్యోగులకు జీతాల పెంపుతో పెద్ద ఊరటను ప్రకటిస్తున్నాయి.

స్పైస్ జెట్..
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన కెప్టెన్లకు నవంబర్ నుంచి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 80 గంటల విమాన ప్రయాణానికి నెలకు రూ.7 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీనిపై కంపెనీ ఈరోజు అధికారిక ప్రకటన చేసింది. ఇదే సమయంలో శిక్షకులు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల జీతాలు కూడా అనుగుణంగా పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

20 శాతం పెంపు..
లో కాస్ట్ విమానయాన సంస్థ మెుదటి విడత చెల్లింపు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) అందుకున్న వెంటనే పైలట్ల వేతనాలను పెంచింది. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చేలా కెప్టెన్‌లకు 20 శాతం జీతం పెంపును ప్రకటించింది. ECLGS కంపెనీ మరో రూ.1,000 కోట్లు అందుకోవటానికి సిద్ధంగా ఉంది.

అంతర్జాతీయ రేట్లతో..
విమానయాన రంగంలో అంతర్జాతీయంగా చెల్లిస్తున్న జీతలతో పోల్చితే భారత్ లో సిబ్బంది తక్కువ వేతనాలను అందుకుంటున్నారు. దేశీయ కంపెనీల్లో పనిచేస్తున్న చాలా మంది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది తక్కువ వేతనాలు అందుకుంటున్నారు.

గత నెలలో అలా..
స్పైస్‌జెట్ సంస్థ సెప్టెంబరులో ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తన వద్ద పనిచేస్తున్న 80 మంది పైలట్‌లను వేతనం లేకుండా మూడు నెలల సెలవుపై వెళ్లమని కోరింది. ఇదే సమయంలో.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంపెనీపై ఉన్న 50 శాతం కెపాసిటీతో నడపాలనే సస్పెన్షన్‌ను అక్టోబర్ 29, 2022 వరకు పొడిగించింది.

ఐదవ స్థానంలో..
DGCA గణాంకాల ప్రకారం మార్కెట్ వాటా ప్రకారం స్పైస్‌జెట్ కంపెనీ 5వ స్థానంలో కొనసాగుతోంది. గత నెలలో 7.9 శాతంగా ఉన్న ఎయిర్‌లైన్ వాటా సెప్టెంబర్‌లో 7.3 శాతానికి పడిపోయింది. సంస్థ విమానాల్లో సెప్టెంబర్‌లో 7.53 లక్షల మంది ప్రయాణించారు. ఇండిగో సంస్థ 57.7 శాతం మార్కెట్ వాటాతో దేశీయ విమానయాన కంపెనీల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. సెప్టెంబరులో ఎయిర్ లైన్ ద్వారా 59.72 లక్షల మంది ప్రయాణించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications