ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి రోజు కళకళలాడుతోంది. లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ ప్లస్సుల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఈ ఉదయం ఏకంగా 800 పాయింట్ల లాభంతో షేర్ మార్కెట్స్ ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత దీని గ్రాఫ్ పైపైకి వెళ్లింది. 900 పాయింట్లను దాటేసింది. 1,000 పాయింట్లకు చేరువగా కనిపించింది. అన్ని ప్రధాన ఇండైసీస్‌కు చెందిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
మార్కెట్ బాగున్నప్పటికీ.. ఇవ్వాళే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోకి డెబ్యూ అయిన ఎథోస్ షేర్లు మాత్రం దారుణంగా దెబ్బకొట్టాయి. ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని పంచాయి. ఒక్కో షేర్ మీద 48 రూపాయల నష్టంతో లిస్టింగ్ అయింది. ఎథోస్ కంపెనీ కటాఫ్ షేర్ ప్రైస్ ధర 878 రూపాయలు. దీనికి భిన్నంగా 830 రూపాయల వద్ద లిస్టింగ్ అయింది. ఆ తరువాత ఏ దశలోనూ షేర్ల ధరలు ప్లస్‌లోకి రాలేదు. మరింత దిగజారాయి. ఉదయం 11 గంటల సమయానికి రూ.793.50 పైసల వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది.

ఈ నష్టం మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. నష్టం అంచనా ఒక షేర్ మీద 100 రూపాయలు దాటొచ్చనీ భావిస్తున్నాయి. కాగా- రూ.472.3 కోట్ల రూపాయలను సమీకరించడానికి ఎథోస్ కంపెనీ కొద్దిరోజుల కిందటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ రిస్ట్ వాచ్ కంపెనీ ఇది. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ భారీగా ఉండటమే దీనికి కారణం అనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.
ఈ ఐపీఓకు దూరంగా ఉండాలంటూ విశ్లేషకులు సైతం సూచించారు. ఇదిలావుండగా.. ఇముద్ర పబ్లిక్ ఇష్యూ.. ఎల్లుండి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కానుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో బెటర్‌గా లిస్టింగ్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. 243-256 ప్రైస్ బ్యాండ్‌తో పబ్లిక్ ఇష్యూకు వచ్చిందీ కంపెనీ. ఇవ్వాళ రీఫండ్ ప్రాసెస్ నడుస్తోంది. అలాట్‌మెంట్ మంగళవారం నాటితో ముగుస్తుంది. బుధవారం లిస్టింగ్ అవుతుంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications