ఇండియాలో లిప్‌స్టిక్ ఎఫెక్ట్.. వారికి ప్రయోజనం ఏమిటిది? లాక్‌డౌన్‌లో ఏం మిస్సయ్యారంటే?
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు లేక సంస్థలు, ఉద్యోగుల చేతుల్లో నగదు లేకుండా పోతోంది. లాక్ డౌన్ అనంతరం ప్రజలు ఖరీదైన, అంతగా అవసరం కాని వస్తువులకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగాల కోత, వేతనాల కోత, ఇన్నాళ్ళు వ్యాపారాలు లేకపోవడం వంటి వివిధ కారణాలతో చేతుల్లో లిక్విడిటీ లేకపోవడం లేదా తగ్గిపోవడం జరిగింది. దీంతో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

కొనుగోలు ఆలోచనా విధానంలో మార్పులు
ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడటానికి కాస్త సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది నెలలు కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల వ్యవహారశైలి మారుతుందని రెడ్ క్వాంటా అనే సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీదైన కొనుగోళ్లు తగ్గించి తక్కువ ధరల్లో లభించే మన్నికైన వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారని తేలింది. లాక్ డౌన్ కారణంగా లిక్విడిటీ తగ్గడం ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది. కొవిడ్ అనంతరం లిప్‌స్టిక్ ఎఫెక్ట్ ఉంటుందని తేలింది.

ఏమిటీ లిప్‌స్టిక్ ఎఫెక్ట్?
అధిక ధరలు ఉండే బ్రాండెడ్ వస్తువులను కొనడం తగ్గిస్తారని ఈ పరిశోధనలో తేలింది. తక్కువ ధరల్లో లభించే మన్నికైన వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ వంటి వాటికి బదులు చిన్న లేదా తక్కువ ధరకు లభించి మన్నికైన లిప్‌స్టిక్ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనినే లిప్‌స్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఆర్థిక మాంద్యం సమయంలో లిప్‌స్టిక్ ఎఫెక్ట్ అనివార్యమంటున్నారు.

వారికి ప్రయోజనం..
కరోనా-లాక్ డౌన్ అనంతరం కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణంగా తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం ఉంటుందని, వారి వ్యాపారం లాభసాటిగా మారే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. రానున్న కొద్ది నెలలు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.

తగ్గిస్తాం..
స్టే హెట్ హోమ్ సమయంలో తాము ఏం కోల్పోయిన అంశాలు కూడా ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 67 శాతం మంది మహిళలు తమ ఫ్యాషన్ షాపింగ్‌పై ప్రభావం పడిందన్నారు. రిటైల్, లీజర్‌పై ఉపయోగించే వాటిపై ఖర్చులు తగ్గాయని 39.75 శాతం మంది చెప్పారు. అదే సమయంలో భద్రతాపరమైన అంశాలపై ఖర్చు చేశామని 26 శాతం మంది చెప్పారు.

ఏం మిస్సయ్యామంటే?
పురుషులు, మహిళలు ప్రధానంగా షాపింగ్, సెలూన్ వైపు వెళ్లడం తగ్గిందని చెప్పారు. 67 శాతం మంది మహిళలు షాపింగ్, 56 శాతం మంది మహిళలు బ్యూటీ సెలూన్, 62 శాతం మంది పురుషులు, 42 శాతం మంది మహిళలు సినిమాలకు వెళ్లలేకపోయామన్నారు. అన్నింటి కంటే ఎక్కువగా 75 శాతం మంది తాము బయటకు డిన్నర్‌కు వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్నారు. కాగా, ఈ అధ్యయనాన్ని మినిమలిజం2.0గా పేర్కొం ది.


Click it and Unblock the Notifications