Life Lesson in Corporate World: కార్పోరేట్ ప్రపంచంలో ఉద్యోగం అంటే తలకు మించిన పోటులాంటిది. ఆ టెన్సన్లు..ఒత్తిడులు, టార్గెట్లను చూస్తే ఏమి జీవితంరా బాబూ అనిపిస్తూ ఉంటుంది. ఇక మనకున్న టెన్సన్లకు తోడుగా కొత్త టెన్సన్లను స్నేహితుల రూపంలో తీసుకువస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది కదా.. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ కార్పోరేట్ ఉద్యోగికి ఎదురయింది. స్నేహితులకి ఉద్యోగం ఇచ్చినందుకు పాపం ఆ ఉద్యోగి బాధ అంతా ఇంతా కాదు.. ఆదేంటో అతని మాటల్లోనే విందాం..
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కార్పొరేట్ ప్రపంచంలో మిడిల్ లెవల్ మేనేజర్‌గా పని చేయడం అంత తేలికైన పని కాదు. లక్ష్యాలను చేరుకోవాలి, బృందాన్ని ముందుకు నడిపించాలి, పై అధికారుల అంచనాలను అందుకోవాలి. అలాంటి నేను నా పనిలో కొంత తేలిక పొందాలని అనుకున్నాను.అయితే నా పాత స్నేహితుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే, నా పని సులభమవుతుందని, బృందం మరింత బలపడుతుందని నమ్మాను. కానీ ఈ నిర్ణయం నాకు జీవితా కాలం మర్చిపోలేని పాఠం నేర్పిందని తెలిపాడు.

ప్రారంభంలో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించింది. స్నేహితుడు ఆఫీసులో చేరగానే వాతావరణం ఉత్సాహంగా మారింది. మునుపటిలాగే ఆఫీసులో సరదాగా గడపగలమని, ఒకరికొకరు తోడ్పాటు అందిస్తారని నేను భావించాను. కానీ పనికి వస్తే పరిస్థితి వేరేలా ఉండేది. స్నేహితుడు పనిలో నా అంచనాలను అందుకోలేకపోయాడు. బాధ్యతలు తీసుకోవాల్సిన చోట నిర్లక్ష్యం చూపాడు. ఫలితంగా నా పని తేలిక అవ్వాలని కోరుకున్న చోట మరింత భారాన్ని మోసుకోవాల్సి వచ్చిందని వాపోయాడు.
రోజులు గడిచేకొద్దీ సమస్యలు మరింత పెరిగాయి. పనిలో లోపాలు సరిచేయాల్సిన బాధ్యత నాపై పడింది. సహజంగానే అతనిని పెట్టుకున్న పాపానికి రోజూ ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. వారం చివరి రోజులు, సెలవుదినాలు కూడా అతని విశ్రాంతి దొరకని రోజులుగా మారిపోయాయి. కుటుంబంతో గడిపే సమయం లేకుండా పోయింది. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా రాకుండా, పగటి ప్రశాంతత కోల్పోయి, పూర్తిగా అలసిపోయే స్థితికి చేరుకున్నాను అని ఆవేదన చెందాడు.
మరోవైపు, అతనికి మరో సమస్య ఎదురైంది. స్నేహితుడు పనిని చేయకపోవడంతో అతన్ని తొలగించాలని అనుకున్నా అది కూడా కష్టంగా మారింది. ఎందుకంటే స్నేహితుడి వ్యక్తిగత జీవిత పరిస్థితులు అతనికి బాగా తెలుసు. EMIలు, కుటుంబ సమస్యలు.. ఇవన్నీ విని అతను స్నేహితుడిపై కఠిన చర్య తీసుకోవడానికి సంకోచించాడు. అధికారికంగా తొలగించగల శక్తి ఉన్నా, మానసికంగా దానిని చేయలేకపోయాడు. స్నేహితుడి నైపుణ్యాలు తక్కువగా ఉన్నందున కొత్త ఉద్యోగం దొరకడం కూడా కష్టమే అని అతనికి స్పష్టంగా తెలిసింది. దీంతో అతను రాత్రి పూట కూడా ఓవర్ టైం చేయాల్సిన పరిస్థితి. నిద్ర కూడా సరిగా పోవడం లేదు. ఈ అనుభవాన్ని అతను ఒక Reddit పోస్ట్‌లో పంచుకున్నాడు.
ఈ కథ విన్న నెటిజన్లలో విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. కొందరు స్నేహితులను నియమించడం లోపభూయిష్ట నిర్ణయమని చెప్పగా... మరికొందరు ఉద్యోగం అనేది స్నేహానికి వేదిక కాదని, అది కచ్చితమైన బాధ్యతల ప్రదేశమని వారు గుర్తు చేశారు. మరికొందరు నెటిజన్లు స్నేహితులను నియమించుకోవడం తప్పుకాదని.. కానీ ప్రారంభం నుండే అంచనాలు స్పష్టంగా చెప్పాలని సూచించారు. దానివల్ల అపార్థాలు తగ్గుతాయని, పనిలో క్రమం ఏర్పడుతుందని వారు విశ్వసించారు.
వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన సంబంధాల మధ్య గీత స్పష్టంగా ఉండాలని మరికొందరు హెచ్చరించారు.స్నేహం విలువైనదే కానీ, ఉద్యోగ ప్రపంచంలో అది ఎప్పుడూ సహజంగా ఉపయోగపడకపోవచ్చు. పనిలో నిబద్ధత లేకపోతే, ఎంత సన్నిహిత స్నేహం ఉన్నా అది సమస్యలకే దారితీస్తుందనేది ఆ మేనేజర్ అనుభవంతో కూడిన కథ ఓ స్పష్టమైన సందేశాన్ని అందించిందని
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications