LIC: అంతర్జాతీయ వేదికలపై ఎల్ఐసీ రోడ్‍షోలు..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెట్టుడుల కోసం అంతర్జాతీయ రోడ్‌షోలను నిర్వహించనుంది. ఈ నెలాఖరులో హాంకాంగ్‌లో రోడ్ షో నిర్వహించనుంది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఏడాది గడిచినా షేర్లలో ఎలాంటి గ్రోత్ లేదు.
దీంతో ఈ రోడ్‌షోలు ఎల్‌ఐసి షేర్ల జాబితా తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాన్-డీల్ రోడ్‌షోలు పెట్టుబడిదారులకు కంపెనీ కథనాన్ని సమగ్రంగా వివరించనున్నాయి. ఇది కార్యనిర్వాహక బృందం, పెట్టుబడిదారుల మధ్య సమర్థవంతమైన అవగాహనను పెంపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్‌ఐసి టాప్ మేనేజ్‌మెంట్ ఐదు రోజుల పాటు జరిగే వరుస సమావేశాల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లతో భేటీ కానుంది. కంపెనీ బలాన్ని వారికి వివరించనుంది. కంపెనీకి భారీ సామర్థ్యం ఉన్నందున ఎల్‌ఐసి స్క్రిప్‌లలో పెట్టుబడులు పెట్టాలని యాజమాన్యం పెట్టుబడిదారులను కోరుతుందని వర్గాలు తెలిపాయి.
గత సంవత్సరం, ఎల్‌ఐసిలో తన 3.5 శాతం వాటాను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)గా వచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం రూ.20,557 కోట్లను సమీకరించింది. ఎల్‌ఐసి షేర్లు మే 17, 2022న 8.62 శాతం తగ్గింపుతో బిఎస్‌ఇలో రూ. 867.20 లిస్ట్ అయ్యాయి. దీని ఇష్యూ ధర రూ. 949 అంటే డిస్కౌంట్ లో షేర్లు లిస్ట్ అయ్యాయి.
ఐపీఓ ద్వారా ప్రభుత్వం 22.13 కోట్ల షేర్లు లేదా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించింది. శుక్రవారం ఎల్‌ఐసీ షేర్లు బీఎస్‌ఈలో 0.32 శాతం క్షీణించి రూ.601.95 వద్ద ముగిసింది. ఈ స్టాక్ ఇప్పుడు దాని IPO ఇష్యూ ధర షేరుకు రూ. 949 నుంచి దాదాపు 40 శాతం క్షీణించింది. దీనితో మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications