ఎల్‌ఐసీ..స్టాక్ మార్కెట్స్ రూ.వేల కోట్లను ఆర్జించింది..
ముంబై: ఈ మధ్యకాలంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది జీవిత బీమా సంస్థ. ఏది కలిసిరావట్లేదు. నష్టాలు వీడట్లేదు. దీని ప్రభావం ఎల్ఐసీ షేర్ల మీద కూడా కనిపించింది. ఎల్ఐసీ షేర్ల ధరలు రోజురోజుకూ పడిపోతూనే వస్తున్నాయి. లిస్టింగ్ అయినప్పటి నుంచీ ఏ దశలోనూ ఎల్ఐసీ షేర్లు లాభాలబాట పట్టలేదు. దీనికితోడుగా- ఎల్ఐసీ కూడా నష్టాల్లో నుంచి బయటికి రావట్లేదు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వేల కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసింది. 17.41 శాతం మేర నికర నష్టాన్ని రికార్డు చేసింది. దీని విలువ రూ.2,371 కోట్ల రూపాయలు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021లో ఇదే చివరి మూడు నెలల కాలంతో పోల్చుకుంటే.. ఈ నష్టం స్వల్పంగా తగ్గింది. అప్పట్లో 2,893 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. ఎల్ఐసీ నికర ప్రీమియం మొత్తం భారీగా పెరిగింది. 1.44 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఈ మొత్తం 1.22 లక్షల కోట్ల రూపాయలే. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ భారీగా తగ్గింది. 2,409 కోట్ల రూపాయలకు పడిపోయింది. గతంలో ఈ మొత్తం 2,917 కోట్ల రూపాయలుగా ఉండేది. మార్చి 31వ తేదీ నాటికి ఎల్ఐసీ సాల్వెన్సీ రేషియో 1.85గా నమోదైంది.

కన్సాలిడేటెడ్ నెట్ కమీషన్‌లో మూడు శాతం పెరుగుదల కనిపించింది. దీని విలువ 7,768 కోట్ల రూపాయలు. ఇటీవలే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. 902-949 రూపాయల ప్రైస్ బ్యాండ్‌తో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ అయింది. మార్కెట్‌లో నెగెటివ్ ట్రెండ్స్‌కు అనుగుణంగా బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయింది. లిస్టింగ్ నాడే భారీ నష్టాన్ని పంచింది ఇన్వెస్టర్లకు. అప్పటి నుంచీ కోలుకోలేకపోతోంది. ఒక్కో షేర్ మీద 100 రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చింది. ఒక దశలో కనిష్ఠంగా 803 రూపాయల వరకు క్షీణించిందీ ఇన్సూరెన్స్ జెయింట్ షేర్ ప్రైస్. సోమవారం రూ.836.50 పైసల వద్ద ట్రేడ్ అయింది.
కాగా- ఎల్ఐసీ పరిస్థితి పోగొట్టుకున్న చోటే వెదుక్కున్నట్టుగా తయారైంది. స్టాక్ మార్కెట్స్ నుంచి 45,000 కోట్ల రూపాయలను ఆర్జించిందీ ఇన్సూరెన్స్ జెయింట్. తనకు ఉన్న ఈక్విటీలను అమ్ముకోవడం ద్వారా 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని పొంద గలిగింది. 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్‌తో పోల్చుకుని చూస్తే ఈ మొత్తం 16.6 శాతం మేర అధికం. ఎఫ్‌వై21లో ఈక్విటీలను విక్రయించడం ద్వారా 36,000 కోట్ల రూపాయలను సాధించగా.. ఎఫ్‌వై22లో ఈ మొత్తం 45,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ కింద ఈక్విటీలను ఇన్వెస్ట్ చేసినట్లు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications