దక్షిణ కొరియాకు మొబైల్ ఫోన్ దిగ్గజం LG ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన మార్కెట్ పోటీ, తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ వస్తుండటంతో LG మార్కెట్ కాస్త తగ్గింది. దీంతో గత ఆరు సంవత్సరాల కాలంలో 4.5 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసింది. దీంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. భారీ నష్టాల కారణంగా స్మార్ట్ ఫోన్ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కంపెనీని ఇతర సంస్థలకు విక్రయించాలనే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో తాజా నిర్ణయం తీసుకుంది.

టాప్ థర్డ్ కంపెనీగా..
LG స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎన్నో వినూత్న పోకడలకు తెరదీచింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సహా ఎన్నో ఆవిష్కరణలు చేసింది. 2013లో మూడో ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా నిలిచింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో గతంలోని దిగ్గజ కంపెనీలు ఇప్పుడు నష్టాలను చవిచూస్తున్నాయి.
ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్, ఆపిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. LG మాత్రం తన సొంత హార్డ్ వేర్, సాఫ్టువేర్ ఇష్యూస్‌తో సతమతమవుతోంది. దీంతో వ్యాపారంలో కొంత వాటాను విక్రయించాలని భావించింది. కానీ ఇది ఫెయిల్ అయింది.

మొట్టమొదటి దిగ్గజం
ఉత్తర అమెరికాలో ఇప్పటికీ ఇది మూడో అతిపెద్ద బ్రాండ్‌గా కొనసాగుతోంది. కానీ ఇతర మార్కెట్లలో మాత్రం పడిపోయింది. సొంత దేశం దక్షిణ కొరియా మార్కెట్‌లో ఫెయిర్‌గానే ఉంది. గత ఏడాది 28 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను ఎల్జీ విక్రయించింది. అదే శాంసంగ్ 256 మిలియన్ల మొబైల్ ఫోన్లు విక్రయించింది. తన మొబైల్ ఫోన్ మార్కెట్‌ను జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు పెద్ద సంస్థలకు విక్రయించాలనే ప్లాన్ విఫలమైంది. మార్కెట్ నుండి పూర్తిగా వైదొలగాలని నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి ప్రధాన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ LG కావడం గమనార్హం.

వాటిపై దృష్టి
LG మొబైల్స్ తాజా నిర్ణయం చాలా కీలకమని, ఇప్పుడు ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికిల్ కాంపోనెంట్స్, కనెక్టెడ్ డివైసెస్, స్మార్ట్ హోమ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. LG కంపెనీకి చెందిన చిన్న ఐదు వ్యాపారాల్లో స్మార్ట్ ఫోన్ వ్యాపారం కూడా ఉంది. రెవెన్యూ కేవలం 7.4 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్లో వాటా 2 శాతం మాత్రమే.


Click it and Unblock the Notifications